స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా రిలీజ్ కానున్న వడ్డే నవీన్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ట్రైలర్

by Pulgam srinivas |

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ట్రైలర్‌ను జూన్ 12 సాయంత్రం 5:30కి వి.వి. వినాయక్ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు.

స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా రిలీజ్ కానున్న వడ్డే నవీన్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ట్రైలర్
X

దిశ, వెబ్ డెస్క్: చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ సీనియర్ నటుడు వడ్డే నవీన్ హీరోగా నటించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను జూన్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కొంతకాలం క్రితమే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్, తాజాగా ట్రైలర్ విడుదలపై కీలక అప్డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 12న సాయంత్రం 5:30 గంటలకు ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వడ్డే నవీన్ ఈ చిత్రంలో హీరోగానే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించడం విశేషం. కమల్ తేజ నార్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ రాశీ సింగ్ హీరోయిన్‌గా కనిపించనుంది. అలాగే కళ్యాణ్ నాయక్ ఈ సినిమాకు సంగీతం అందించారు.




Next Story