- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెట్రోల్ బంకుల్లో ‘బల్క్’ కొనుగోళ్లపై నిషేధం
పెట్రోల్ బంకుల ద్వారా పరిశ్రమలు, కమర్షియల్ సంస్థలు భారీ మొత్తంలో (Bulk) పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు భారీ మొత్తం పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) కొనుగోలు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిషేధించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. సాధారణ వినియోగదారుల కోసం కేటాయించిన సబ్సిడీ చమురును రిటైల్ ధరతో కొనుగోలు చేస్తూ పారిశ్రామిక రంగాలు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. చమురు మార్కెటింగ్ సంస్థలు పరిశ్రమలకు, భారీ రవాణా సంస్థలకు విక్రయించే ‘బల్క్’ ఇంధన ధరలకు.. సాధారణ ప్రజలు బంకుల్లో కొనే రిటైల్ ధరలకు చాలా తేడా ఉంది. బల్క్ ధరలు మార్కెట్ రేట్లకు అనుగుణంగా ఎక్కువగా ఉన్న సమయంలో కొన్ని పరిశ్రమలు, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు, ఫ్యాక్టరీలు నేరుగా పెట్రోల్ బంకులకు వచ్చి ట్యాంకర్ల ద్వారా తక్కువ ధరకే డీజిల్, పెట్రోల్‌ను తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు భారీగా ఆదాయ నష్టం వాటిల్లుతోంది.
కొత్త నిబంధనలు ఇలా..
పరిశ్రమలు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు, మాల్స్, మైనింగ్ కంపెనీలు, పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్‌లు తమ పవర్ జనరేటర్లు, సొంత అవసరాల కోసం బంకుల నుంచి పెద్ద మొత్తంలో ఇంధనాన్ని తీసుకెళ్లకూడదు. అలాంటి బల్క్ కస్టమర్లు ఇకపై నేరుగా చమురు మార్కెటింగ్ సంస్థల (OMCs) ద్వారానే డీజిల్, పెట్రోల్‌ను బుక్ చేసుకుని, సదరు కమర్షియల్ ధరలకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించి భారీ ట్యాంకర్లు, బారెల్స్‌లో ఇండస్ట్రీలకు ఇంధనాన్ని నింపే పెట్రోల్ బంకుల డీలర్లపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.






