ఎల్లుండి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్​ మరోసారి విచారణ

by Muthe.Rajitha |   (  Updated:2025-10-22 16:55:15  IST  )

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇప్పటికే విచారణ చేపట్టిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్​రేపటి నుండి మరోసారి విచారణ జరుపనున్నారు.

ఎల్లుండి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్​ మరోసారి విచారణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇప్పటికే విచారణ చేపట్టిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్​ ఎల్లుండి నుండి మరోసారి విచారణ జరుపనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి బుధవారం స్పీకర్​/ చైర్మన్​ట్రిబ్యునల్​పదో షెడ్యూల్​కింద విచారణ షెడ్యూల్​ని విడుదల చేశారు. ఈ సారి జరిగే విచారణలో వాదనలు మౌఖికంగా ఉంటాన్న పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యేల విచారణ నేపథ్యంలో ఈనెల 24 నుంచి 31 వరకు అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు కూడా విధించారు.

ఈ మౌఖిక వాదనలు ఎమ్మెల్యేల తరుఫు న్యాయవాదులు పిటీషనర్ల తరుఫు న్యాయవాదుల మద్య జరుగనున్నది. ఇప్పటికే ముగిసిన క్రాస్​ఎగ్జామినేషన్స్​లో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహాన్​రెడ్డిలు విచారణకు హాజరయ్యారు. ఈనెల 24న జరిగే మౌఖిక వాదనల్లో స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్​ ఉదయం 11 గంటలకు కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ ప్రకాష్ గౌడ్ కేసు విచారణ చేపట్టనున్నారు.

ఎమ్మెల్యే తరుఫు న్యాయవాదులు, పిటిషనర్ తరుఫు న్యాయవాదులు మౌఖిక వాదనలు వినిపిస్తారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య కేసు విచారణ, మధ్యాహ్నం రెండు గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి కేసు విచారణ, మధ్యాహ్నం మూడు గంటలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేసు విచారణను స్పీకర్​చేపట్టనున్నారు. విచారణ సందర్బంగా విధించిన ఆంక్షలు విధించడంతో అసెంబ్లీ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు.

Next Story