- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంఎస్ఎంఈపై టీజీ రెడ్కో ముందడుగు
పెట్టుబడుల ఆకర్షణలో ముందుంటున్న తెలంగాణ రాష్ట్రం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల ఏర్పాటుకు క్లస్టర్లను అభివృద్ధి చేయడంలోనూ సత్తా చాటుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: పెట్టుబడుల ఆకర్షణలో ముందుంటున్న తెలంగాణ రాష్ట్రం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల ఏర్పాటుకు క్లస్టర్లను అభివృద్ధి చేయడంలోనూ సత్తా చాటుతోంది. ఎంఎస్ఎంఈ క్లస్టర్డెవలప్మెంట్ప్రొగ్రాం (పీడీపీ) కింద రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 20 వరకు ఇండస్ట్రియల్పార్కులను అభివృద్ధి చేస్తు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో పంజాబ్18వ శాతంలోనూ, మధ్య ప్రదేశ్11వ స్థానంలోనూ, ఉత్తర ప్రదేశ్10వ స్థానంలోనూ, తమిళనాడు రాష్ట్రం 9వ స్థానంలో ఉన్నాయి. ఈ విధంగా ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణనే అగ్రస్థానంలో ఉండడం విశేషం.
మహబూబ్‌నగర్‌జిల్లా జడ్చర్లలో లెదర్డిజైన్క్లస్టర్, మెదక్‌జిల్లా దుద్దెడలో జనరల్ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్పార్కు , ఖమ్మం జిల్లా బుగ్గపాడులో ఫుడ్ప్రాసెసింగ్పార్కు ఇలా వివిధ ఎంఎస్ఎంఈ క్లస్టర్లు ఏర్పాటు అవడంలో తెలంగాణ రెడ్కో సహయ సహకారాలను అందిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 15న హర్యానా రాష్ట్రంలోని పానిపట్ లో ఈ మేరకు ఎంఎస్ఎంఈ లలో ఇంధన సామర్ద్యాన్ని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించనున్నారు. ఇదే సమావేశంలో టీజీ రెడ్కోకు అభినందనలు వెల్లువెత్తనున్నాయి. రెడ్కో సంస్థ ఈ రంగంలో తీసుకున్న చర్యలు తదితరాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.






