TG: రాష్ట్రంలో రికార్డు దిశగా విద్యుత్ డిమాండ్.. 16,506 మెగావాట్లకుపైగా నమోదు

by Kema Shiva Kumar |

తెలంగాణ రాష్ట్రంలో ఎండల ప్రభావం రోజురోజుకూ పెరుగుతుండడంతో ఉక్కపోతలు అదే స్థాయిలో నెలకొంటున్నాయి.

TG: రాష్ట్రంలో రికార్డు దిశగా విద్యుత్ డిమాండ్.. 16,506 మెగావాట్లకుపైగా నమోదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఎండల ప్రభావం రోజురోజుకూ పెరుగుతుండడంతో ఉక్కపోతలు అదే స్థాయిలో నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ప్రజలు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లకు పని చెబుతుండడంతో ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. మొన్నటి దాకా 16వేల మెగావాట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్ ఇప్పడు 16,506 మెగావాట్లకు పెరిగింది. అదే సమయంలో విద్యుత్ బిల్లులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క ఇంటికి సగటున రూ.500 వరకు మాత్రమే వచ్చే విద్యుత్ బిల్లులు ఇప్పడు తడిసి మోపెడవుతున్నాయి. కొన్ని ఇళ్లలో రూ.700 నుండి మొదలకొని రూ.వెయ్యి వరకు బిల్లులు వస్తున్నాయి. ఈ వేసవిలోనే విద్యుత్ డిమాండ్ 17వేల మెగావాట్లకు దాటవచ్చని విద్యుత్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వ్యవసాయ పరంగా పలు జిల్లాల్లో అప్పుడే కరెంటు కోతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రైతులు అప్పుడే సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు కూడా చేస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం విద్యుత్ సరఫరా విషయంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయాలని, అవసమైతే తనకు నేరుగా ఫోన్ చేయవచ్చని ఈ సందర్భంగా సూచిస్తున్నారు.

సరఫరాలో అంతరాయం లేకుండా..

ఇదిలా ఉంటే విద్యుత్ అంతరాయాలు లేకుండా ట్రాన్స్కో ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు. కరెంటు సరఫరాకు ఎక్కడ అంతరా యం వచ్చినా, విద్యుత్ ఫీడర్లు ట్రిప్పయినా, ఓవ ర్ లోడ్ సమస్యలు నెలకొన్నా ఖైరతాబాద్ మిం ట్ కాంపౌండ్ పరిధిలోని టీజీ ఎస్పీడీసీఎల్ ప్ర ధాన కార్యాలయంలో ఎలక్ట్రిసిటీ కమాండ్ కం ట్రోల్ సెంటర్ వ్యవస్థను అధికారులు ఏర్పాటు చేశారు. అటు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో కూ డా ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు హన్మకొండ ప్రధాన కార్యాలయం అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు.

వేసవికి ముందే హై డిమాండ్

డిమాండ్‌కు తగిన సప్లయ్ చేయటానికి డిస్కంలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఈసారి వేసవిలోనే విద్యుత్ డిమాండ్17వేల మెగావాట్ల మైలు రాయిని ఈజీగా చేరుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది మార్చిలో అత్యధికంగా 15 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడితే ఈసారి 16,506 మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది. ఎండలు పూర్తిగా మొదలు కాకముందే ఈ రకమైన డిమాండ్ ఉంటే పీక్ సమ్మర్‌లో ఊహించని స్థా యిలో డిమాండ్ ఏర్పడే అవకాశాలు ఉన్నా యని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తం గా ఈ జనవరిలో పదివేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడితే ఒక్క హైదరాబాద్ మహానగ రంలోనే 5వేల మెగావాట్ల డిమాండ్ దాటడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. మొత్తం 16,506 మె గావాట్ల డిమాండ్ ఏర్పడిందని, వచ్చే మార్చి లోనే ఇది 17వేల మెగావాట్లకు చేరడంతో పా టు ఈ ఏడాది పీక్ సమ్మర్‌కి కనీ సంగా 17వేల నుంచి 18 వేల మెగావాట్ల పైచి లుకు డిమాండ్ ఏర్పడే అవకాశాలు లేకపోలేదని అధికార వర్గాలు అనధికారికంగా వివరిస్తున్నారు.

Next Story