- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Politics: దానం ఇంట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ.. కీలక నిర్ణయం!
సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి (Telangana Assembly Secretary) నోటీసులు అందుకున్న పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇవాళ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి (Telangana Assembly Secretary) నోటీసులు అందుకున్న పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇవాళ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ మేరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) ఇంట్లో తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశం అయ్యారు. వారితో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి (Government Adviser Vem Narender Reddy)తో భేటీలో పాల్గొన్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై వారు ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ (Telangana Assembly Secretary), సుప్రీం కోర్టు (Supreme Court)కు ఇచ్చే సమాధానంపై కూడా చర్చ జరగనుంది. ఎమ్మెల్యేలు అంతా వెంటనే ఢిల్లీకి వెళ్లి అక్కడ సమాలోచనలు చేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కాగా, బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో గెలిచి కాంగ్రెస్ (Congress)లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి 2025, ఫిబ్రవరి 4న నోటీసులు జారీ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసిన అసెంబ్లీ సెక్రటరీ.. పార్టీ మార్పు వ్యవహారంపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కోరారు. స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో చేరారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై బీఆర్ఎస్ తెలంగాణ హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించింది. హైకోర్టులో అనుకూలంగా తీర్పు రాకపోవడంతో బీఆర్ఎస్ సుప్రీం కోర్టు (Supreme Court)కు వెళ్లింది. ఈ మేరకు బీఆర్ఎస్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.






