- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Police: ఓవర్ టూ సంధ్య థియేటర్.. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌కు పోలీసుల యత్నం
సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ (Allu Arjun)ను ఇవాళ పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ (Chikkadpally Police Station)లో విచారిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ (Allu Arjun)ను ఇవాళ పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ (Chikkadpally Police Station)లో విచారిస్తున్నారు. ఈ మేరకు గంటన్నర నుంచి కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్‌పై సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ (Central Zone DCP Akshansh Yadav), ఏసీపీ రమేష్ (ACP Raju), సీఐ రాజు నాయక్ (CI Raju Nayak) ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా, సీన్ రీ కన్స్ట్రక్షన్ (Scene Reconstruction)లో భాగంగా సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్దకు అల్లు అర్జున్‌ను తీసుకెళ్తామంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉన్నతాధికారులు భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ (Scene Reconstruction)లో భాగంగా థియేటర్ వద్ద అసలు ఏం జరిగింది.. ఎక్కడి నుంచి బయలుదేరారు.. తనతో ఎంతమంది వచ్చారు? బౌన్సర్లు ఎంత మంది, వాళ్లు ఏం చేశారు? అసలు తోపులాట ఎక్కడి నుంచి ప్రారంభమైందనే అనే విషయాలపై అల్లు అర్జున్‌ను పోలీసులు ప్రశ్నించారు.
Read More...
Allu Arjun:కొనసాగుతోన్న విచారణ.. అల్లు అర్జున్‌ను పోలీసులు అడిగే ప్రశ్నలివే!?






