- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Police: టెలిగ్రామ్ లో వచ్చే లింక్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి.. తెలంగాణ పోలీసులు సూచన
భారతదేశం(India)లో గత కొన్ని నెలల నుంచి సైబర్ క్రైమ్స్(Cyber Crimes) విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లో గత కొన్ని నెలల నుంచి సైబర్ క్రైమ్స్(Cyber Crimes) విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త అవతారాలెత్తి ప్రజల నుంచి డబ్బును దోచేస్తున్నారు. కాగా డిజిటల్ అరెస్ట్(Digital Arrest) పేరుతో సైబర్ నేరగాళ్లు ఇటీవలే పలువురిని మోసం చేసి డబ్బును ఖాజేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఇక కొంత మంది పైరసీ మూవీస్(Piracy Movies), అశ్లీల వీడియోల(Porn videos)ను చూడటానికి టెలిగ్రామ్(Telegram)లోని వివిధ గ్రూపుల్లో జాయిన్(Jion) అయితున్నారు. సైబర్ నేరగాళ్లు ఇదే అదునుగా భావించి గ్రూపుల్లో ఫేక్ వెబ్ లింక్స్ షేర్ చేసి మన ఫోన్లో ఉన్న డేటాను దోచుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు తెలంగాణ పోలీసులు(TG Police) హెచ్చరికలు జారీ చేశారు. టెలిగ్రామ్ లో తెలియని నంబర్/గ్రూప్ నుంచి వచ్చే లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్త సినిమాలు, వీడియోల పేరుతో లింక్స్ షేర్ చేస్తున్నారని, ఈ లింక్స్ క్లిక్ చేస్తే సైబర్ క్రిమినల్స్(Cyber Criminals) చేతిలోకి మన పర్సనల్ డేటా(Personal Data) వెళ్లే ప్రమాదముందని తెలిపారు. అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్(Meesage)లకు రెస్పాండ్ కావొద్దని, వాటితో ఆధార్(Aadhar), పాన్(PAN) వివరాలు సేకరించి మోసాలకు పాల్పడే అవకాశముందని, బీ కేర్ ఫుల్ అంటూ హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు.






