TG Police: పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కీలక పరిణామం.. నల్గొండ ఇంటలిజెన్స్ ఎస్పీ కవితపై వేటు

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-11 11:02:52  IST  )

తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ (Telangana Police Department)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

TG Police: పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కీలక పరిణామం.. నల్గొండ ఇంటలిజెన్స్ ఎస్పీ కవితపై వేటు
X

దిశ, వెబ్‌డెస్క్/నల్లగొండ బ్యూరో: తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ (Telangana Police Department)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నల్గొండ (Nalgonda) జిల్లా ఇంటలిజెన్స్ ఎస్పీ గంజి కవిత( Intelligence SP Ganji Kavitha)పై వేటు పడింది. ఈ మేరకు కవితను వెంటనే డీజీపీ (DGP) కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, సమగ్ర విచారణ అనంతరం ఆమెను సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. విధి నిర్వహణలో భాగంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో కవిత అనేక అక్రమాలు, భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లవెత్తాయి. సొంత సిబ్బంది నుంచి కూడా వసూళ్లకు పాల్పడినట్లు పుకార్లు షికార్లు చేశాయి.

ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు కవిత అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు స్పెషల్ షాడో టీమ్ (Special Shadow Team)ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రేషన్ (Ration), గుట్కా (Gutka) మాఫీయా నుంచి అక్రమ వసూళ్లు, కింది స్థాయి సిబ్బంది వద్ద కూడా చేతివాటం ప్రదర్శించినట్లుగా షాడో టీమ్ నిర్ధారించింది. కవితతో పాటు ఓ ఎస్సై (SI), మరో ముగ్గురు కానిస్టేబుళ్లు, ఓ హెడ్ కానిస్టేబుల్ కూడా ఆమె అక్రమాల్లో భాగస్వాములు అయినట్లుగా తేలింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆమెను డీజీపీ (DGP) కార్యాలయానికి అటాచ్ చేస్తూ.. తాజాగా, ఉత్తర్వులు జారీ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఎస్పీ చేసిన అక్రమాలను ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకునేందుకు కొంతమంది రిపోర్టర్లు ఆమె వద్ద నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారితో రహస్యంగా ముచ్చటించిన ఫోటోలు, వీడియో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరో రెండు, మూడు రోజుల్లో అవి బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం.

Next Story