TG Police: సీఎంలకు అమిత్ షా ఫోన్.. తెలంగాణ పోలీసుల కీలక ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-25 08:59:54  IST  )

జమ్మూకశ్మీర్‌‌ (Jammu Kashmir)లోని పహల్గాం (Pahelgam)లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

TG Police: సీఎంలకు అమిత్ షా ఫోన్.. తెలంగాణ పోలీసుల కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌‌ (Jammu Kashmir)లోని పహల్గాం (Pahelgam)లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. భారత్‌ (India)లో ఉన్న పాకిస్థాన్ (Pakistan) పౌరులు వెంటనే వెళ్లిపోవాలని, పాక్‌ పౌరులను ఇక నుంచి భారత్‌లోకి అనుమతించేదని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ (Indian Foreign Secretary Vikram Misri) స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ప్రత్యేకంగా ఫోన్ చేశారు. రాష్ట్రంలో పాక్ దేశస్తులను వెంటనే గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. అదేవిధంగా స్థానికంగా ఉంటున్న పాకిస్థానీయుల డేటాను కేంద్రానికి పంపించాలని కోరారు. అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఉన్న పాకిస్థానీయులపై పోలీసులు ఇప్పటికే ఫోకస్ పెట్టారు. అందుకు సంబంధించి వివరాలను కూడా సేకరించారు. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్‌ నగరంలో 208 మంది పాకిస్థానీయులు ఉన్నట్లుగా తేల్చారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. మరో 48 గంటల్లో పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించారు.

Next Story