- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశాంతంగా ముగిసిన టీజీ పీజీఈసెట్.. 90.64 శాతం హాజరు
by Ramesh Naini |
రాష్ట్రంలో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ తదితర పీజీ కోర్సుల్లో (2026-27) ప్రవేశాల కోసం జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టీజీ పీజీఈసెట్’ పరీక్షలు సోమవారంతో ప్రశాంతంగా ముగిశాయి.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ తదితర పీజీ కోర్సుల్లో (2026-27) ప్రవేశాల కోసం జేఎన్టీయూహెచ్ (JNTUH) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టీజీ పీజీఈసెట్’ పరీక్షలు సోమవారంతో ప్రశాంతంగా ముగిశాయి. మే 29 నుంచి జూన్ 1 వరకు నాలుగు రోజుల పాటు రోజుకు రెండు సెషన్ల చొప్పున మొత్తం 19 సబ్జెక్టులకు ఈ పరీక్షలు నిర్వహించారు.
హైదరాబాద్, వరంగల్ పరిధిలో మొత్తం 26,077 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 23,637 మంది (90.64%) పరీక్షకు హాజరైనట్లు కన్వీనర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు.
Next Story






