- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, సిటీక్రైం : డ్రగ్స్ దందాతో లింక్ ఉన్న హవాలా ముఠాల పై తెలంగాణ యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ బ్యూరో కన్నెర్ర చేసింది. వాటి మూలాలను పెకిలించేందుకు టీజీనాబ్ నడుం బిగించింది. ఈ నేపధ్యంలోనే టీజీనాబ్ డ్రైరక్టర్ సందీప్ శాండిల్య నేపధ్యంలోని అధికారులు డ్రగ్స్ ముఠాతో మిలాఖత్ అయిన హవాలా వ్యాపారుల పై ఈడీ తో పాటు డైరెక్టర్ రెవెన్యూ ఇంటలిజెన్స్, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సంస్థలకు స్వయంగా ఫిర్యాదు చేసింది. దీని కోసం టీజీ నాబ్ బ్రుందం ఢిల్లీకి వెళ్ళి ఈ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులను చేసింది. దీంతో ఇప్పుడు నైజీరియా దేశానికి చెందిన డ్రగ్స్ ముఠాలతో పాటు దేశవ్యాప్తంగా డ్రగ్స్ దందా చేస్తున్న అక్రమ ముఠాల ఆర్ధిక గుట్టును బయటపెట్టేందుకు టీజీ నాబ్ ఈ ప్రణాళికతో డ్రగ్స్ దందాను నియంత్రించేందుకు సరికొత్త ప్రక్రీయను తెరపైకి తీసుకువచ్చింది.
డ్రగ్స్ దందాలో 2 రోజుల్లో 52 లక్షలు
టీజీ నాబ్ అధికారులు నైజీరియా దేశానికి చెందిన డ్రగ్స్ ముఠాల పని పనిపట్టేందుకు గోవాలలో నెల రోజుల పాటు మాటు వేసి స్పెషల్ అపరేషన్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో డ్రగ్స్ దందా చేస్తున్న వారి నుంచి డబ్బులను వసూలు చేసి వాటిని నైజీరియాకు పంపిస్తున్న లింక్ ను పట్టారు. ఈ లింక్ ను ఆరా తీస్తే డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియా దేశానికి చెందిన గ్యాంగ్ ల నుంచి హవాలా దందా చేస్తున్న ఏజెంట్ లు వాటిని రోజువారిగా సేకరించి వాటిని నైజీరియా దేశానికి చెందిన బ్యాంకులకు ట్రాన్సఫర్ చేస్తున్న రహస్యాన్ని పసిగట్టారు.
లోతు గా దర్యాప్తు చేస్తే ఈ హవాలా ఏజెంట్ ల రెండు రోజుల కలెక్షన్ 52 లక్షలు ఉన్నట్లు గుర్తించి , గోవాలో హవాలా ఏజెంట్ ఉత్తమ్ సింగ్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో హవాలా ఏజెంట్ డ్రగ్స్ ముఠాల నుంచి వసూలు చేసిన నగదును నైజీరియాకు 2 శాతం కమీషన్ మీద అక్కడి బ్యాంకులకు పంపించారని గుర్తించారు. ఇలా ఒక వారంలో దాదాపు 2.10 కోట్ల వరకు ఆర్ధిక లావాదేవిలు హవాలా వ్యాపారులు, డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిందని టీజీ నాబ్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ లింక్ ను దెబ్బకొట్టేందుకు టీజీ నాబ్ ఈడీ కి ఫిర్యాదు చేసింది.
ఈడీకి పూర్తి ఆధారాలు
టీజీ నాబ్ అధికారులు ఈడీకి వారు గోవాలో జరిపి స్పెషల్ అపరేషన్ లో వెలుగు చూసిన 150 నైజీరియా దేశానికి చెందిన బ్యాంక్ లావదేవిలు, హవాలా ఏజెంట్ ఏ విధంగా డబ్బులను కలెక్షన్ చేస్తున్న తీరుకు సంబంధించిన ఆధారలు, ప్రాధమికంగా డ్రగ్స్ ముఠాలకు, హవాలా గ్యాంగ్ లకు ఉన్న ఆధారాలను ఈడీ అధికారులకు ఫిర్యాదుతో పాటు ఇచ్చారు. వాట్సాప్ లో చిరిగిన నోటును చూపిస్తే డ్రగ్స్ ముఠాలు హవాల ఏజెంట్ లకు కలెక్షన్ లను అప్పజెప్పే వైనానికి సంబంధించిన విడియోలను కూడా ఈడీ అధికారులకు ఇచ్చారు.
హవాలా ఏజెంట్ ఉత్తమ్ సింగ్ తో లింక్ ఉన్న డ్రగ్స్ ముఠాల కు సంబంధించి దాదాపు 2 ఏండ్ల నుంచి జరిగిన ఆర్ధిక లావాదేవిల పై దర్యాప్తు చేయాలని టీజీ నాబ్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. ఈడీ దర్యాప్తులో దేశ వ్యాప్తంగా ఉన్న డ్రగ్స్ ముఠాలతో లింక్ ఉన్న హవాలా వ్యాపారుల గుట్టు రట్టవుతుందని, దీంతో డ్రగ్స్ దందాకు కీలకమైన ఆర్ధిక మూలాలు ధ్వంసమవుతాయని అధికారులు ఆశిస్తున్నారు. త్వరలోనే టీజీ నాబ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈడీ దర్యాప్తును ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.






