TG Main: పుర‘పోరు’కు సర్కార్ సమాయత్తం.. వార్డుల విభజనకు షెడ్యూల్ రిలీజ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-04 03:16:56  IST  )

మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు సర్కార్ సమాయత్తం అవుతోంది.

TG Main: పుర‘పోరు’కు సర్కార్ సమాయత్తం.. వార్డుల విభజనకు షెడ్యూల్ రిలీజ్
X

* మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు సర్కార్ సమాయత్తం అవుతోంది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా వార్డుల విభజనకు మంగళవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 21 వరకు ప్రక్రియ పూర్తి చేయాలని మునిసిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి అధికారులను ఆదేశించారు. అయితే, వార్డుల విభజనకు సర్కార్ విడుదల చేసిన షెడ్యూల్ చూసేద్దాం.

* ప్రభుత్వ ఉద్యోగాల రిటైర్మెంట్ వయసు విషయంలో తెలంగాణ సర్కార్ కీలక అడుగు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఏడాది పెంచితే.. పొలిటికల్‌గా ప్రభుత్వాలకి మైలేజ్ వస్తుందా.. లేదా? అని లాభనష్టాలపై ప్రభుత్వం పెద్దలు సమాలోచనలు చేస్తు్న్నారు. పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి.

* ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ ‘మేఘా’పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు అక్షింతలు వేసింది. ఆ సంస్థపై వార్తలు రాయొద్దంటూ మేడ్చల్ జిల్లా కోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను కొట్టివేస్తూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఏమన్నదో తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

* కన్నడ భాషపై కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అయితే, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను మరోసారి సమర్ధించుకున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు. ఇంతకీ కమలహాసన్ ఏమన్నారో మీరూ చూసేయండి మరి.

* రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చరిత్ర సృష్టించింది. ఐపీఎల్-18 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ జట్టుపై 6 పరుగుల తేడాతో విజయం సాధించి.. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత టైటిల్‌ను ముద్దాడింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

Next Story