- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Main: ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ.. మంత్రుల శాఖల మార్పుపై కొనసాగుతోన్న సస్పెన్స్
మంత్రుల వద్ద ప్రస్తుతం ఉన్న శాఖలను మార్చేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం కసరత్తును స్పీడప్ చేసింది.

* మంత్రుల వద్ద ప్రస్తుతం ఉన్న శాఖలను మార్చేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం కసరత్తును స్పీడప్ చేసింది. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మంతనాలు జరిపారు. అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పిలిపించుకున్నారు. దీంతో శాఖల మార్పు అందరి మంత్రులకు ఉంటుందా.. లేక మారుస్తారా అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి.
* కాళేశ్వరం కమిషన్ విచారణ చరమాంకానికి చేరుకుంది. చిట్టచివరగా విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ ఉదయం 11.30కి కమిషన్ ఎదుట హాజరు కాబోతున్నారు. అయితే, ఆనాడు ప్రాజెక్ట్ నిర్మాణాల్లో భాగంగా అత్యంత కీలకంగా వ్యవహరించిన మంత్రులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు, వాస్తవాలకు పొంతన కుదరడం లేదనే అభిప్రయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో నేట విచారణలో కేసీఆర్ కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారనే ఆసక్తిగా మారింది. పూర్తి వివరాలకు వార్తలోకి వెళ్లండి ఇక్కడ.
* ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బుధవారం మరోసారి సిట్ ఎదుట హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. మంగళవారం ఆయన అనూహ్యంగా నాంపల్లి కోర్టు హాజరయ్యారు. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.
* రాఘవా లారెన్స్ హీరోగా.. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘బెంజ్’ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్లుగా సంయుక్త మీనన్, ప్రియంక మోహన్ నటిస్తున్నారు. అయితే, ఇదే మూవీకి సంబంధించి ఓ తాజా అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇందులో మరో హీరోయిన్ జాయిన్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకోవాలంటే పూర్తి వార్తలోకి వెళ్లండి ఇక్కడ.
* ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ నేడు ప్రారంభం కాబోతోంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా మరోసారి సత్తా చాటేందుకు రెడీ అవుతుండగా.. ఎలాగైనా తొలిసారి ఐసీసీ టైటిల్‌ను ముద్దాడాలని సౌతాఫిక్రా ఉవ్విళ్లూరుతోంది. అయితే, ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి.. గెలుపు అవకాశాలు ఎవరికి? తెలుసుకోవాలంటూ ఈ లింక్ క్లిక్ చేయండి.






