- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: స్థానిక ఎన్నికలు.. లాటరీ ద్వారా రిజర్వేషన్లు ఖరారు
గ్రామ పంచాయతీ ఎన్నికలను(Panchayat Elections) మూడు విడతల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: గ్రామ పంచాయతీ ఎన్నికలను(Panchayat Elections) మూడు విడతల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఈ మేరకు అధికార యంత్రాంగం ఆ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ప్రస్తుతం రిజర్వేషన్ల పైనే అందరికీ ఆసక్తి నెలకొని ఉంది. డెడికేటెడ్ కమిషన్ పంపిన వివరాల ఆధారంగా అధికారులు రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆదివారం అధికారికంగా రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్‌ను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యలు రిజర్వేషన్లు నేడు పూర్తికానుంది. రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు నిన్న రొటేషన్ పద్దతిలో ఫైనల్ చేశారు. ఈ రిజర్వేషన్ల ఖరారుపై రేపు(సోమవారం) ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మరోవైపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌పై రేపు హైకోర్టులో తుది విచారణ జరుగనుంది. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించనుంది. రేపు లేదా ఎల్లుండి పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.






