- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Inter JAC: రేవంత్ రెడ్డి పాలనలో ఇంటర్ విద్యకు మహర్దశ..ఇంటర్ విద్యా జేఏసీ ప్రశంసలు
గత పాలకులు ప్రభుత్వ ఇంటర్ కాలేజీలను పట్టించుకోలేదని టీజీ ఇంటర్ జేఏసీ ఆరోపించింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: విద్య మాత్రమే సమాజాభివృద్ధికి దోహదం చేస్తుందనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy చిత్తశుద్ధి ఇలాగే కొనసాగితే ప్రభుత్వ ఇంటర్ విద్యకు పూర్వవైభవం చేకూరుతుందని తెలంగాణ ఇంటర్ విద్యా జేఏసీ (Telangana Inter Education JAC) ) ఆశాభావం వ్యక్తం చేసింది. సీఎం ఆసక్తి, వ్యక్తిగత చొరవ, విద్యారంగంపై నిరంతర సమీక్షల ప్రభావంగా ఇంటర్ విద్యలో అనేక సంస్కరణలు వచ్చాయని జేఏసీ అభినందించింది. ఈ మేరకు ఇంటర్ విద్యపై సీఎం చూపిస్తున్న ప్రత్యేక చొరవను ప్రశంసిస్తూ తెలంగాణ ఇంటర్ జేఏసీ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కాళాశాల్లో చదువుకుంటున్న విద్యార్థులందరికీ యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం, ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు ఇంటర్ విద్యాభివృద్ధికి మరింత తోడ్పాటు అందించాలని కోరింది.
గత ప్రభుత్వం గాలికి వదిలేసింది:
గత ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ కాలేజీలను నిర్లక్ష్యం చేసి, ప్రైవేట్ రంగం నియంత్రణను గాలికి వదిలేశాయని దాంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అంతరించే పరిస్థితి ఏర్పడ్డాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల సంఖ్య 380 మాత్రమేనని వీటిలో చేరే విద్యార్థుల సంఖ్య 60 వేల లోపు మాత్రమేనన్నారు. 2014-2023 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉచిత విద్యను అమలుపరుస్తూ ఉత్తర్వులు ఇచ్చినా నిధులు మాత్రం కేవలం 2 కోట్లు మాత్రమే ఇచ్చిందని అందులో ఖర్చు చేసినవి కేవలం 62 లక్షలు మాత్రమేనన్నారు. కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం వచ్చాక తీసుకున్న అనేక అద్భుత నిర్ణయాలు ప్రభుత్వ ఇంటర్ విద్యకు జవసత్వాలు నింపాయని పేర్కొన్నారు.
చరిత్రలోనే మొట్టమొదటిసారిగా..:
టీజీపీఎస్సీ ద్వారా సుమారు 1300 మంది అధ్యాపకులను నూతనంగా నియమించడం, జూనియర్ కాలేజీలకు ప్రతి నెల కాలేజీ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్ మంజూరు చేయడం వంటి నిర్ణయాలు మేలు చేస్తున్నాయన్నారు. పలు సమస్యలతో సతమతం అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలను గుర్తించి 326 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మౌళిక వసతులు, మరమ్మతుల నిమిత్తం 56.16 కోట్ల రుపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని, ప్రభుత్వ కాలేజీల్లో ల్యాప్ అప్ గ్రేడింగ్ కోసం రూ. 25 వేలు, క్రీడా పరికరాల నిమిత్తం రూ. 10 వేల చొప్పున ప్రత్యేక నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు. కాలేజీల్లో సీ.సీ కెమెరాలు, ఎఫ్.ఐఆర్.ఎస్ ద్వారా హాజరు నియంత్రణ చర్యలు బాగున్నాయని ప్రశంసించారు. బోధన, బోధనేతర సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం సాధారణ సెలవులు(సీ.ఎల్), మెడికల్ రియంబర్స్ మెంట్ వరకు అన్ని ఆన్‍లైన్ సేవలను అందుబటులోకి తెచ్చారని ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్ విద్య చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి విద్యార్థులకు తల్లిదండ్రుల నుంచి సహకారాన్ని, ప్రోత్సహాన్ని కలిగించేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించి పరీక్ష కేంద్రాలను గూగుల్ మ్యాప్ ద్వారా సులభంగా తెలుసుకునేలా చేయడం, పరీక్షా పత్రాల ముద్రణలో సంస్కరణలు, పునర్ మూల్యాంకనం వంటి అనేక చర్యలను జేఏసీ ప్రస్తావించింది.






