- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG High Court: అజారుద్దీన్‌కు హైకోర్టులో రిలీఫ్.. HCAకు ధర్మాసనం కీలక ఆదేశాలు
భారత జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin)కు తెలంగాణ హైకోర్టు (High Court)లో ఊరట లభిచింది.

దిశ, వెబ్‌డెస్క్: భారత జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin)కు తెలంగాణ హైకోర్టు (High Court)లో ఊరట లభించింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియం (Uppal Cricket Stadium)లోని నార్త్ స్టాండ్ (North Stand)కు అజారుద్దీన్ పేరును తొలగించాలంటూ HCA అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య (Justice Easwaraiah) ఇటీవలే ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఆదేశాలను సవాలు చేస్తూ.. అజారుద్దీన్ హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు విని హెచ్‌సీఏ (HCA)కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు ఉన్న అజారుద్దీన్ పేరు తొలగించొద్దని, యథావిధిగా ఉంచాలని ఆదేశించింది. అదేవిధంగా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హెచ్‌సీఏకు సూచించింది.
అసలు ఏం జరిగిందంటే..
HCA ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో అజారుద్దీన్ ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు తన పేరును పెట్టుకున్నాడు. అయితే, ఆ నిర్ణయాన్ని అజారుద్దీన్ ఏకపక్షంగా తీసుకున్నాడని లార్డ్స్ క్రికెట్ క్లబ్, HCA అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఆ ఫిర్యాదుపూ విచారణ చేపట్టిన అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య.. స్టాండ్ పేరు పెట్టుకోవడంలో అజారుద్దీన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తేల్చారు. దీంతో వెంటనే నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరును తొలగించాలని, టికెట్లపై కూడా ఆయన పేరుతో స్టాండ్ ఉండొద్దని హెచ్‌సీఏను ఈశ్వరయ్య ఆదేశించారు. అయన ఆదేశాలను సవాల్ చేస్తూ అజారుద్దీన్ హైకోర్టును ఆశ్రయించారు. తాను భారత జట్టుకు కొన్నేళ్ల పాటు ఆడానని, కెప్టెన్‌గా కూడా వ్యవహరించానని కోర్టుకు తెలిపారు. స్టాండ్ పేరు విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదంటూ వాదనను వినిపించారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు అంబుడ్స్‌మన్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.






