TG High Court: నోటీసులిచ్చి విచారించండి.. హరీష్‌రావు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు

by Kema Shiva Kumar |

ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping case) కేసులో మరో కీలక పరిమాణం చోటుచేసుకుంది.

TG High Court: నోటీసులిచ్చి విచారించండి.. హరీష్‌రావు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping case) కేసులో మరో కీలక పరిమాణం చోటుచేసుకుంది. ఎన్నికల సందర్భంగా తన ఫోన్‌ను ట్యాప్ చేయించారంటూ సిద్దిపేట (Siddipet)కు చెందిన చక్రధర్ గౌడ్ (Chakradhar Goud)ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటీవలే పంజగుట్ట పోలీసులు మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao), టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావు (Radha Kishan Rao)పై ఐటీ యాక్ట్ (IT Act) కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు పంజాగుట్ట పీఎస్‌ (Panjagutta Police Station)లో తనపై నమోదైన కేసును వెంటనే కొట్టివేయాలని హైకోర్టు (High Court)లో బుధవారం హరీశ్‌రావు (Harish Rao) క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు (High Court) ధర్మాసనం పంజాగుట్ట పీఎస్‌ (Panjagutta PS)లో నమోదైన కేసులో హరీశ్ రావును అరెస్ట్ చేయోద్దంటూ ఆదేశాలు చేసింది. ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులకు సూచించింది.

కాగా, గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తన ఫోన్‌ను హరీశ్ రావు (Harish Rao), రాధాకిషన్ రావు (Radha Kishan Rao) ఆదేశాల మేరకు పోలీసులు ట్యాప్ చేశారని చక్రధర్ గౌడ్ (Chakradhar Goud) తన ఫిర్యాదులో వెల్లడించారు. అదేవిధంగా తనపై అక్రమ కేసులు బనాయించి మానసికంగా వేధించారని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులకు గురి చేశారని చక్రధర్ గౌడ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు 120 (B), 386, 409, ఐటీ యాక్ట్ కింద హరీశ్ రావు, రాధాకిషన్‌ రావులపై కేసులు నమోదయ్యాయి.

Next Story