- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG High Court: ఫార్ములా ఈ-కారు రేసింగ్ కేసు.. హైకోర్టులో వాడీవేడిగా కొనసాగుతోన్న వాదనలు
ఫార్ములా ఈ-కారు రేసింగ్ (Formula E-Car Racing) కేసులో తనపై ఏసీబీ (ACB) నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ.. ఈ నెల 21న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) హైకోర్టు (High Court)లో క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-కారు రేసింగ్ (Formula E-Car Racing) కేసులో తనపై ఏసీబీ (ACB) నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ.. ఈ నెల 21న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) హైకోర్టు (High Court)లో క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై ఇవాళ మరోసారి జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే కోర్టులో కేటీఆర్ (KTR) తరఫు న్యాయవాది సిద్ధార్థ్ దవే (Siddharth Dave) తన వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో కేటీఆర్ (KTR)కు సెక్షన్ 409 ఏమాత్రం వర్తించదని పేర్కొన్నారు. ఫార్ములా ఈ-కారు రేసింగ్ వ్యవహారంలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని అన్నారు. సొంత ప్రయోజనాలకు కూడా ఆ డబ్బులను కేటీఆర్ వాడుకోలేదని తెలిపారు.
ఈ మొత్తం వ్యవహారంలో తన క్లయింట్‌కి ఒక్క రూపాయి రాలేదని కోర్టుకు తెలిపారు. ఒకవేళ కేటీఆర్‌కు 409 అప్లై చేస్తే దేశంలో గందరగోళం నెలకొనే ఛాన్స్ ఉందని వాదించారు. దేశంలో ఇకపై ఏ మంత్రి కూడా ఫైల్ మీద సంతకాలు చేయబోరని పేర్కొన్నారు. అందుకు సంబంధించి బాంబే హై కోర్టు (Bombay High Court) నుంచి ఇప్పటి వరకు అన్నీ కేసుల ఉదాహరణలు తాను కోర్టుకు అందజేయగలని అన్నారు. పర్మిషన్ తీసుకోలేదనే విషయానికి సెక్షన్ 405 వర్తించదని ధర్మాసనానికి తెలిపారు. కేటీఆర్ (KTR) ఓ మంత్రిగా నిర్ణయం తీసుకున్నారని, బ్యాంకింగ్ చానల్స్ ద్వారానే నిధులు ఆర్గనైజింగ్ టీంకు నిధులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని అన్నారు. ఏసీబీ (ACB) అధికారులు చెబుతోన్న రూ.8 కోట్లు కూడా కేటీఆర్ (KTR) ఖాతాలోకి వెళ్లవని.. ఆ డబ్బు కూడా నిర్వాహకులకే వెళ్తుందని సిద్ధార్థ్ దవే తన వాదనలు వినిపిస్తున్నారు.
అయితే, సిద్ధార్థ్ దవే వాదనలు విన్న కోర్టు BNS వచ్చాక IPC కింద ఎందుకు కేసు పెట్టారని ప్రశ్నించింది. అందుకు ఆయన 14 నెలల క్రితం నేరం జరిగినందునే ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదైనట్లుగా కోర్టుకు తెలిపారు. డబ్బు చేరిన వ్యక్తిని నిందితుడిగా చేర్చలేదని.. ఆ విదేశీ సంస్థ పేరు ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో FEO వివరాలను కేటీఆర్ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. విచారణ కొనసాగే క్రమంలో కేటీఆర్‌ను నిందితుడిగా చేర్చొచ్చు కదా అని హైకోర్టు తెలుపగా.. 13(1)(a) సెక్షన్ తన క్లయింట్‌కు వర్తించదని సిద్ధర్థ్ దవే అన్నారు.






