TG High Court: తెలంగాణ సర్కార్‌కు బిగ్ షాక్.. లగచర్ల, హకీంపేట్ భూసేకరణపై హైకోర్టు స్టే

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-06 09:02:30  IST  )

తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది.

TG High Court: తెలంగాణ సర్కార్‌కు బిగ్ షాక్.. లగచర్ల, హకీంపేట్ భూసేకరణపై హైకోర్టు స్టే
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కార్‌ (Telangana Government)కు హైకోర్టు (High Court)లో ఊహించని షాక్ తగిలింది. వికారాబాద్‌ జిల్లా (Vikarabad District) కొడంగల్‌ నియోజకవర్గ పరిధిలోని లగచర్ల (Lagacharla), హకీంపేట్‌ (Hakimpet) గ్రామాల్లో మల్టీపర్పస్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వం విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్ హైకోర్టు కొట్టివేసింది. అదేవిధంగా భూసేకరణపై తక్షణమే స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది. అయితే, లగచర్ల, హకీంపేట్ గ్రామాల్లోని భూ సేకరణ నోటిఫికేషన్‌లో పేర్కొన్న మొత్తం 8 ఎకరాలపై కోర్టు అభ్యతరం వ్యక్తం చేసి స్టే ఇచ్చింది.

కాగా, తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం భూసేకరణకు నవంబర్ 30న, డిసెంబర్ 1న రెండు నోటిఫికేషన్లను విడుదల చేసింది. అందులో దుద్యాల మండలంలోని లగచర్ల (Lagacharla), పోలేపల్లి (Polepally), హకీంపేట్ (Hakimpet), పులిచర్లకుంట తండా (Pulicharlakunta Thanda), రోటిబండ తండా (Rotibanda Thanda)ల పరిధిలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ (Multipurpose Industrial Park) కోసం 1,177 ఎకరాల భూసేకరణకు టీజీఐఐసీ (TGIIC) ద్వారా ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది. అందులో 534 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 643 ఎకరాలు పట్టా భూమి ఉంది. అయితే, భూ నిర్వాసితులకు నష్ట పరిహారం కింద ఎకరాకు రూ.20 లక్షలు, 150 గజాల ప్లాటు, ఇంటికో ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని వికారాబాద్ కలెక్టర్ (Vikarabad Collector) ప్రతీక్ జైన్ (Pratik Jain) ఆయన గ్రామా ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో వారంతా భూసేకరణకు అంగీకరించారు. పోలేపల్లి, హకీంపేట్, లగచర్ల , పులిచర్లకుంట తండాలో ఇప్పటికే సర్వే కాగా.. పోలేపల్లి రైతులకు నష్ట పరిహారం అందించారు. రోటిబండ తండా పరిధిలో ఉన్న 17 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేసేందుకు అధికారులను రైతులు అడ్డుకున్న విషయం విదితమే.

Next Story