- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG High Court: తెలంగాణలో మల్టీప్లెక్స్‌లకు బిగ్ రిలీఫ్.. హైకోర్టు సంచలన ఆదేశాలు
రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సినిమా ప్రదర్శనపై ఉదయం 11లోపు రాత్రి 11 తర్వాత అనుమతించవద్దంటూ తెలంగాణ హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్ (Multiplex)లలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సినిమా ప్రదర్శనపై ఉదయం 11లోపు రాత్రి 11 తర్వాత అనుమతించవద్దంటూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే, సినిమా ప్రదర్శనలపై ఆంక్షల నేపథ్యంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ (Multiplex Association) ఇటీవలే హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా సవరిస్తూ 16 సంవత్సరాల లోపు పిల్లలను అన్ని షోలకు అనుమతించాలంటూ తీర్పును వెలువరించింది. కానీ, ప్రీమియర్ షో (Premier Shows)లు, బెనిఫిట్ షో (Benefit Show)లు, స్పెషల్ షో (Special Show)లలో తొక్కిసలాటలు జరుగుతోన్న నేపథ్యంలో చిన్నారులకు అనుమతి లేదని సాధారణ షోలకు మాత్రమే అనుతిస్తున్నట్లుగా కోర్టు వ్యాఖ్యేనించింది. కేసు తదుపరి విచారణను కోర్టు మార్చి 17కు వాయిదా వేసింది.






