- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG High Court: గులాబీ బాస్‌కు బిగ్ రిలీఫ్.. ‘కాళేశ్వరం’పై మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు
తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో మాజీ సీఎం కేసీఆర్ (KCR)కు బిగ్ రిలీఫ్ లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో మాజీ సీఎం కేసీఆర్ (KCR)కు బిగ్ రిలీఫ్ లభించింది. కాళేశ్వరం నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకొవద్దని మాజీ సీఎస్ ఎస్‌కే జోషి, ఐఏఎస్ స్మిత సబర్వాల్‌లో పాటు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ మరోసారి ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్‌సింగ్, న్యాయమూర్తి జీఎం మోయిద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. అదేవిధంగా ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేసేందుకు గాను 4 వారాల పాటు గడువు, ప్రభుత్వ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు నలుగురు పిటిషనర్లకు మరో మూడు వారాల పాటు టైమ్ ఇచ్చింది. అప్పటి వరకు కేసులో అంతకు ముందుకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పొడిగిస్తున్నట్లుగా ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.






