TG High Court: బెట్టింగ్ యాప్స్ కేసు.. హైకోర్టులో విష్ణు‌ప్రియకు బిగ్ షాక్

by Kema Shiva Kumar |

బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్ (Betting Aap Promotion) చేసిన 11 మంది సెలబ్రిటీలు (Celebrities), సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల (Social media Influencers)పై ఇటీవలే పంజాగుట్ట (Panjagutta), మియాపూర్ (Miyapur) పోలీసులు కేసులు నమోదు చేసి నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే.

TG High Court: బెట్టింగ్ యాప్స్ కేసు.. హైకోర్టులో విష్ణు‌ప్రియకు బిగ్ షాక్
X

దిశ, వెబ్‌‌‌డెస్క్: బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్ (Betting Aap Promotion) చేసిన 11 మంది సెలబ్రిటీలు (Celebrities), సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల (Social media Influencers)పై ఇటీవలే పంజాగుట్ట (Panjagutta), మియాపూర్ (Miyapur) పోలీసులు కేసులు నమోదు చేసి నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నోటీసులు తీసుకున్న నటి విష్ణుప్రియ (Vishnupriya) ఈ నెల 20న పంజాగుట్ట (Panjagutta) పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నెల 25 ఆమె మరోసారి పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉండగా.. బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్‌ (FIR)ను క్వాష్ (Quash) చేయాలంటూ హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు ఇవాళ ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎఫ్‌ఐఆర్‌ (FIR)ను కొట్టివేసేందుకు, దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. విచారణలో పోలీసులకు సహకరించాలని విష్ణుప్రియకు.. చట్ట ప్రకారం దర్యాప్తు కొనసాగించాలంటూ పోలీసులకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Next Story