TG High Court: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కొనసాగుతోన్న వాదనలు.. విచారణ మధ్యాహ్నానికి వాయిదా

by Kema Shiva Kumar |   (  Updated:2024-12-31 08:25:02  IST  )

ఫార్ములా ఈ-కారు రేసు (Formula E-Car Racing) కేసులో తనపై ఏసీబీ (ACB) నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ.. ఈ నెల 21న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) హైకోర్టు (High Court)లో క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు.

TG High Court: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కొనసాగుతోన్న వాదనలు.. విచారణ మధ్యాహ్నానికి వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-కారు రేసు (Formula E-Car Racing) కేసులో తనపై ఏసీబీ (ACB) నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ.. ఈ నెల 21న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) హైకోర్టు (High Court)లో క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై ఇవాళ మరోసారి జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే కోర్టులో కేటీఆర్ (KTR) తరఫు న్యాయవాది సిద్ధార్థ్ దవే (Siddharth Dave) తన వాదనలు పూర్తిగా వినిపించారు. ప్రభుత్వం తరఫున వాదనలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విచారణను కోర్టు మధ్యాహ్నం 2.30కి వాయిదా వేసింది.

Next Story