TG Govt.: ఖమ్మం జిల్లా రైతులకు తీపి కబురు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-06 04:05:36  IST  )

శ్రీరామ నవమి పర్వదినం వేళ ఖమ్మం జిల్లా రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది.

TG Govt.: ఖమ్మం జిల్లా రైతులకు తీపి కబురు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామ నవమి (Srirama Navami) పర్వదినం వేళ ఖమ్మం జిల్లా (Khammam District) రైతులకు తెలంగాణ సర్కార్ (Telangana Government) తీపికబురు చెప్పింది. ఈ మేరకు సీతారామ ప్రాజెక్ట్ (Sitarama Project) నిర్మాణానికి గాను సవరించిన అంచనా బడ్జెట్‌కు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆమోదం తెలిపినట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Thummala Nageshwar Rao) వెల్లడించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి మంత్రి తుమ్మలతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Miniter Uttam Kumar Reddy) ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా సీఎం ఆమోదం తెలిపారు. ఇప్పుడున్న మైనింగ్ కాలేజీని ఎర్త్ సైన్సెస్ వర్సిటీ అప్‌గ్రేడ్ చేయనున్నారు.

కాగా, సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టు అంచనాలను పెంచే అంశంపై ఇటీవలే క్యాబినెట్‌లో చర్చ కొనసాగింది. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని 2016 ఫిబ్రవరి 18న రూ.7,926 కోట్ల అంచనాతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) పరిపాలన అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. అనంతరం పథకంలో మార్పులు చేపడుతూ.. అందుకు సీతారామ ఎత్తిపోతల పథకంలోనే సీతమ్మ బ్యారేజీని కూడా చేర్చారు. దీంతో, 2018 ఆగస్టులో రూ.13,057 కోట్లకు అంచనాలను సవరించారు. తాజాగా, ఆ అంచనాలను రూ.13,057 కోట్ల నుంచి రూ.19,324.92 కోట్లకు సవరించాల్సి ఉండగా.. తాజాగా సీఎం రేవంత్ అందుకు ఆమోదం తెలిపారు. ఖమ్మం (Khammam), భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem), మహబూబాబాద్‌ (Mahabubabad) జిల్లాల్లో 4,15,621 ఎకరాలకు సాగు నీటిని, మరో 3,89,366 ఎకరాలను స్థిరీకరించేందుకు చేపట్టిన ఈ పథకానికి ఇప్పటి వరకూ రూ.10 వేల కోట్లు ఛర్చు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.

Next Story