TG Govt.: తెలంగాణకు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు.. ‘కంట్రోల్ ఎస్’ సంస్థతో ఎంవోయూ

by Shiva |   ( Updated:2025-01-22 06:32:48.0  )
TG Govt.: తెలంగాణకు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు.. ‘కంట్రోల్ ఎస్’ సంస్థతో ఎంవోయూ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy), దావోస్ (Davos) పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. తెలంగాణ‌ (Telangana)ను పారిశ్రామిక రంగంలో మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (World Economic Forum) సదస్సు వేదికగా రేవంత్ బృందం పలు విదేశీ కంపెనీ ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ (Hyderabad) కేంద్రంగా రూ.10 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్ (AI Data Center) క్లస్టర్‌ ఏ‌ర్పాటుకు ‘కంట్రోల్ ఎస్’ (Control S) అనే సంస్థ తెలంగాణ ప్రభుత్వం (Telangana Government)తో ఎంవోయూ (MOU) చేసుకుంది. దాదాపు 100 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్‌ (Data Center)ను ఏర్పాటు చేయనున్నారు. కస్టర్ ఏర్పాటుతో 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

కాగా మంగళవారం తెలంగాణ సర్కార్ మరో రెండు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. అందులో ‘స్కైరూట్’ (Sky Root) అనే కంపెనీ సుమారు రూ.500 కోట్ల పెట్టుబడితో ప్రైవేట్ రాకెట్ల (Private Rockets) తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ (Integration and Testing Unit) ఏర్పాటుకు ప్రభుత్వంతో ఎంవోయూ (MOU) చేసుకుంది. ఇక హైదరాబాద్ (Hyderabad) కేంద్రంగా హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ (HCL Tech Global) సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ పెవిలియన్‌లో సీఎం రేవంత్‌‌ రెడ్డి (CM Revanth Reddy), మంత్రి శ్రీధర్‌‌బాబు (Minister Sridhar Babu)తో HCL టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ విజయ్ కుమార్‌ (CEO, MP Vijay Kumar), ఆ కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు. హైటెక్ సిటీ (Hi-Tech city)లో దాదాపు 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్‌సీఎల్ క్యాంపస్‌ (HCL Campus)ను నిర్మించనుంది. కొత్త క్యాంపస్ నిర్మాణంతో దాదాపు 5 వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఫిబ్రవరి నెలలోనే క్యాంపస్‌ను ప్రారంభించాలని సీఎం రేవంత్‌ను హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ (HCL Tech Global) ఎండీ విజయ్ కుమార్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed