- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Govt.: మహిళా సంఘాలకు భారీ గుడ్ న్యూస్.. ‘అభయ హస్తం’ నిధుల విడుదలపై కీలక అప్‌డేట్!
రాష్ట్రంలోని మహిళా సంఘాలకు రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy Government) గుడ్ న్యూస్ చెప్పనుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని మహిళా సంఘాలకు రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy Government) గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ మేరకు ‘అభయహస్తం’ (Abhaya Hastham) పథకం కింద 2009 నుంచి 2016 వరకు స్వయం సహాయక బృందాలు జమ చేసిన మొత్తాన్ని తిరిగి మహిళా సంఘాలకు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అదేవిధంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (Rural Poverty Alleviation Organization) (సెర్ప్) సహకారంతో గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను వెంటనే సిద్ధం చేస్తోంది.
మహిళలను అర్ధికంగా పటిష్టం చేసేందుకు 2009లో నాటి కాంగ్రెస్ సర్కార్ (Congress Government) ‘అభయహస్తం’ (Abhaya Hastham) పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే, గ్రూప్‌లో చేరిన ప్రతి మహిళా సభ్యురాలు ఏడాదికి రూ.365 ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తూ వచ్చింది. సంఘ సభ్యుల వయసు 60 ఏళ్లు దాటితే వారికి రూ.500 పింఛన్ అందించాలన్న లక్ష్యంతో ఆ పథకానికి అప్పటి ప్రభుత్వం పురుడు పోసింది. ప్రతి ఫ్యామిలీలో చదువుతున్న పిల్లలకు ఏడాదికి రూ.1,200 చెల్లించింది. ఒకవేళ సభ్యురాలు మరణిస్తే రూ.30 వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.75 వేలు, శాశ్వత వైకల్యానికి రూ.75 వేలు, పాక్షిక వైకల్యానికి రూ.37,500 చెల్లించింది.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ (BRS Government) అధికారంలోకి రావడంతో ‘అభయహస్తం’ కనుమరుగైంది. ‘అభయహస్తం’ పథకంలో కట్టిన సొమ్ము తిరిగి చెల్లిస్తామని చెప్పినా.. స్వయం సహాయక సంఘాలకు ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదు. తాజాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రావడంతో అభయహస్తం నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (Rural Poverty Alleviation Organization) (సెర్ప్) ఇచ్చిన నివేదిక మేరకు సుమారు రూ.425 కోట్ల అభయహస్తం నిధులను ప్రభుత్వం మహిళల బ్యాంకు ఖాతాల్లో త్వరలోనే జమ చేయనుంది.






