TG Govt.: సంక్షేమ పథకాలపై సర్కార్ ఫోకస్.. ప్రజల్లోకి తీసుకెళ్లేలా పక్కా ప్లాన్

by Kema Shiva Kumar |

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మరింత దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

TG Govt.: సంక్షేమ పథకాలపై సర్కార్ ఫోకస్.. ప్రజల్లోకి తీసుకెళ్లేలా పక్కా ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మరింత దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో సగటున ప్రతి నెలకూ ఒకటి చొప్పున ఏదో ఒక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభిస్తున్నా.. అవి అనుకున్నంత స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం లేదని ప్రభుత్వం గుర్తించింది. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్పప్రచారం ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుందని సర్కార్ ఓ అభిప్రాయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే డిసెంబర్​వరకు పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపైనే దృష్టి పెట్టాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ప్రతి పథకానికి లక్షల్లో లబ్ధిదారులు ఉన్నా... అనుకున్నంత స్థాయిలో ప్రచారం జరగకపోవడం, ఆర్థిక ప్రయోజనాన్ని వారికి గుర్తుచేయడంలో వెనకబడ్డామని ప్రభుత్వానికి పలు నివేదికలు అందాయి. అనేక సంక్షేమ పథకాలను అమలు ప్రభుత్వానికి భారమైనా పార్టీ కేడర్, నాయకులు, ఎమ్మెల్యేలు పెద్దగా ప్రచారం చేయడం లేదని రాష్ట్ర నాయకత్వం గుర్తించింది. క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తెప్పించుకొని ఈ మేరకు విశ్లేషణ జరిపారు. ఇకపై పథకాల అమలు, వాటిని ప్రజలకు వివరించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలని సర్కార్ నిర్ణయానికి వచ్చింది.

ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండాలి

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు మైలేజ్ రావాలంటే ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే ఉండి.. ప్రతి గ్రామంలోనూ పర్యటించాలని సీఎం రేవంత్ సీఎల్పీ సమావేశంలో స్పష్టంగా ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయాలని, లబ్ధిదారులు ఎంత మందికి, ఎంత మొత్తంలో లబ్ధిచేకూరుస్తున్నామనేది.. వాటి కోసం ఎన్ని నిధులను రాష్ట్ర వ్యాప్తంగా కేటాయిస్తున్నామనేది ప్రజలకు వివరించాలని సూచించారు. తద్వారా పార్టీకి, ప్రభుత్వానికి, ఎమ్మెల్యేగా మీకు ప్రయోజనం ఉంటుందన్నారు. దీని ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలవడం సులువు అవుతుందన్నారు. కాగా, కొందరు దీనిని పెడచెవిన పెట్టి హైదరాబాద్‌కు పరిమితం అవుతున్నట్లుగా సీఎం రేవంత్‌లు నివేదికలు అందాయి. వారిపై సీఎం అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ను వదిలి క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని స్పష్టం చేశారు. అలా అయితేనే ఫలితం ఉంటుందని, తాను మే మొదటి వారంలో జిల్లాల్లో పర్యటిస్తానని ప్రకటించారు.

మహిళలకు ఆర్థిక ప్రయోజనం..

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించింది. ప్రతిరోజూ లక్షలాది మంది మహిళలకు ప్రత్యక్షంగా ఎంతో ఆర్థిక ప్రయోజనం ఈ స్కీమ్ ద్వారా కలుగుతున్నది. ప్రైవేటు ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు, పేద, మధ్య తరగతి వారికి ప్రత్యక్షంగా నెలకు కనీసం రూ. వెయ్యి నుంచి 3 వేల వరకు డబ్బులు మిగులుతున్నాయి. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ద్వారా 51 లక్షల కుటుంబాలపైనా, నెలకు ప్రతి కుటుంబానికి రూ.1000కి పైగా ఆదా అవుతుంది. 51 కుటుంబాల్లో ఒక్కో ఇంటికి ముగ్గురిని చొప్పున లెక్కవేసినా కోటిన్నర మందికి ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. దీనితో పాటుగా మరో 50 లక్షల కుటుంబాలు రూ.500 గ్యాస్​ సిలిండర్ స్కీం ద్వారా వారికి రూ.400 వరకు ఆదా అవుతున్నది.

రూ.21 వేల కోట్ల రుణమాఫీ..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొ ఇంటికి ముగ్గురిని తీసుకున్నా కోటిన్నర మందికి లబ్ది జరుగుతుంది. రుణమాఫీ ద్వారా 25 లక్షల కుటుంబాలకు రూ.21వేల కోట్లు మాఫీ జరిగింది. ఇంకా మరికొందరికి రుణమాఫీ చేయాల్సి ఉందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నా... 25 లక్షల కుటుంబాలు లబ్ధిపొందిన విషయాన్ని అధికార కాంగ్రెస్​ గుర్తు చేస్తుంది. రైతుభరోసా కూడా వ్యవసాయ యోగ్యం అయిన భూములన్నింటికీ ప్రభుత్వం రైతు భరోసా అందిస్తుంది. ఇందులో 60 లక్షల కుటుంబాలకు ఎకరానికి రూ.12 వేలు అందిస్తున్నారు. ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా రూ.12 వేలు అందిస్తున్నారు.

ఇందులో అయితే అత్యధిక కూలీలు.. వారు కూలీ ద్వారా పొందే మొత్తం కంటే ఈ పథకం ద్వారానే ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకం 5 లక్షల కుటుంబాలకు ఉపయోగపడుతుంది. సన్న బియ్యానికి క్షేత్ర స్థాయిలో అద్భుత స్పందన లభించింది. దీని ద్వారా 90 లక్షల కార్డుదారులు, 2.50కోట్ల మందికి ప్రయోజనం కలిగింది. ప్రతి ఒక్కరూ రేషన్​ బియ్యం వండుకొని తింటున్నారు. గతంలో బియ్యం తక్కువ ధరకు విక్రయించుకొని సన్న బియ్యం ఎక్కువ ధరకు కొనుగోలు చేసే వారు. కానీ, ఈ పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుడు రేషన్​ బియ్యం

Next Story