- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Govt.: తెలంగాణ సర్కార్ మరో విజయం.. ఇన్ఫోసిస్, అమెజాన్ కంపెనీలతో కీలక ఎంవోయూలు
తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దావోస్ (Davos) పర్యటనలో మరో ముందడుగు పడింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దావోస్ (Davos) పర్యటనలో మరో ముందడుగు పడింది. ఈ మేరకు ఇవాళ వరల్డ్ ఎకానమిక్ ఫోరం (World Economic Forum) సదస్సులో భాగంగా సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) బృందం తెలంగాణ పెవీలియన్ (Telangana Pavilion)లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో భాగంగా తెలంగాణ (Telangana)లో ఇన్ఫోసిస్ (Infosys) కార్యకలాపాల విస్తరణపై కీలక ఒప్పందాలు చేసుకున్నారు. హైదరాబాద్ (Hyderabad) శివారు ప్రాంతంలోని పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ (Infosys Campus) విస్తరణపై భేటీలో చర్చించారు. ఫేజ్-1 (Phase-I)లో రూ.750 కోట్లతో ఆ కంపెనీ ఐటీ భవనాలను నిర్మించనుంది. క్యాంపస్ విస్తరణతో దాదాపు 17 వేల కొత్త ఉద్యోగాలు యువతకు లభించనున్నాయి. అదేవిధంగా ఆన్‌లైన్ కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో కూడా తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ కేంద్రంగా రూ.60 వేల కోట్లతో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
కాగా, దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సర్కార్ (Telangana Government) కొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు రూ.56,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించి దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అందులో ఇంధన రంగంలో దేశంలోనే పేరొందిన సన్ పెట్రో కెమికల్స్ (Sun Petro Chemicals) సంస్థ రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు (Hydro Electricity), సౌర విద్యుత్తు (Solar Electricity) ప్రాజెక్టుల ఏర్పాటుకు రూ.45,500 కోట్ల ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని నాగర్ కర్నూలు (Nagar Kurnool), మంచిర్యాల (Manchiryala, ములుగు (Mulugu) జిల్లాల్లో మూడు చోట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టుల (Pumped storage Hydro Power Projects)ను నెలకొల్పుతామని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ మూడు ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం 3400 మెగావాట్లు. వీటికి 5440 మెగావాట్ల సామర్థ్యం ఉండే సౌర విద్యుత్తు ప్లాంట్లను అనుసంధానం చేయనుంది. అదేవిధంగా ఇవాళ హైదరాబాద్ (Hyderabad)లో విప్రో (Wipro) సంస్థ విస్తరణకు (Wipro Company Expansion) అంగీకారం కుదిరింది. గోపనపల్లి (Gopanpally) క్యాంపస్‌లో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో 5 వేల మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.






