- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HCU lands: హెచ్ సీయూ భూములపై ప్రతిపక్షాలకు ప్రభుత్వం కౌంటర్ ప్లాన్.. వారితో డిప్యూటీ సీఎం కీలక భేటీ
హెచ్ సీయూ భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, డైనమిక్ బ్యుూరో: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో హెచ్ సీయూ విద్యార్థులు, ప్రతిపక్షాలు ఆందోళనలు ఉధృతం చేస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) అలర్ట్ అయింది. ఈ భూముల విషయంలో ఒక్కొ ఆధారాన్ని వెల్లడిస్తున్న ప్రభుత్వం తాజాగా ఇవాళ ప్రజాసంఘాలతో భేటీ అయింది. ప్రొ.హరగోపాల్, ఎమ్మెల్సీ కోదండరామ్, పలువురు ప్రజాసంఘాల నేతలతో ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచనతో ప్రజాసంఘాలతో సమావేశమైన భట్టివిక్రమార్క (Deputy CM Bhatti Vikramarka).. హెచ్ సీయూ భూముల వివాదం, కేటాయింపులు, కోర్టు కేసుల వంటి అంశాలపై ప్రజాసంఘాలకు వివరాలు అందజేసినట్లు తెలిసింది. ఈ భూములకు సంబంధించి సుదీర్ఘ కాలంగా కోర్టులో కేసు నడుస్తున్నా ఏనాడు హెచ్ సీయూ ఈ కేసులో ఇంప్లీడ్ కాలేదు. సుప్రీకోర్టు తీర్పుకు అనుగుణంగా ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వేలం వేస్తుంటే హఠాత్తుగా విద్యార్థులు, యూనివర్సిటీ అభ్యంతరం చెప్పడంపై ఈ సమావేశంలో భట్టి విక్రమార్క వివరాలు వెల్లడిస్తున్నారు. లీగల్ గా అన్ని అంశాలు ప్రభుత్వ పక్షాన ఉన్నప్పటికీ ఈ ఆందోళనల వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని అందువల్ల న్యాయపరమైన అన్ని అంశాలను వివరించి ఆందోళన బాట పట్టిన విద్యార్థులను కన్విన్స్ చేసే విషయాన్ని ప్రజాసంఘాలతో భట్టి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భూముల విషయంలో ఓ వైపు విద్యార్థులు, మరో వైపు రాజకీయ పార్టీలు తమ పోరాటాన్ని ఉధృతం చేసిన క్రమంలో ప్రభుత్వం చెబుతున్న వాదనలను విద్యార్థులు ఏ మేరకు అంగీకరిస్తారు అనేది ఉత్కంఠగా మారింది. ఈ విషయంపై కాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
ముగిసిన సీఎం సమీక్ష:
హెచ్ సీయూ భూముల విషయంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. హెచ్ సీయూ భూముల వివరాలను ఈ సందర్భంగా మంత్రులకు సీఎం అందజేశారు. భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, సీతక్క హజరైన ఈ సమావేశంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. కంచ గచ్చిబౌలి భూములపై ప్రభుత్వానికి ఉన్న హక్కులు, వాటిపై ప్రభుత్వ ప్రణాళికలతో పాటు ఈ అంశంలో ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి అనే అంశంపై మంత్రులకు సీఎం కీలక దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. హెచ్ సీయూలో విద్యార్థి సంఘ నేతలను, అక్కడి సిబ్బందిని రాజకీయంగా రెచ్చగొట్టి ఈ ఆందోళనలు చేస్తున్నారనే అభిప్రయాలను ఈ సమావేశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆందోళనలపై వ్యవహరించాల్సిన తీరు, ప్రజల్లోకి తప్పుడు సమాచారం వెళ్లకుండా ఏం చేయాలనే దానిపై ఈ భేటీలో సీఎం మంత్రులకు వివరించినట్లు సమాచారం.
సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి!:
ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి (Revanth Reddy Delhi Tour) వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పీసీసీ చీప్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద 12 బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరగబోయే మహాధర్నాలో తెలంగాణ సీఎం, మంత్రులు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి పాల్గొననున్నట్లు సమాచారం. విద్య, ఉపాధి, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లలను ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే ఆ బిల్లులను పార్లమెంట్ ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు మహాధర్నాకు సిద్ధమయ్యాయి.






