TG GENCO: జెన్‌కో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి.. ప్రభుత్వానికి రూ.900 కోట్ల ఆదా

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-23 09:09:45  IST  )

రాష్ట్ర చరిత్రలోనే నాగార్జున‌సాగర్‌ (Nagarjuna Sagar)లో జెన్‌కో (GENCO) రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని సాధించింది.

TG GENCO: జెన్‌కో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి.. ప్రభుత్వానికి రూ.900 కోట్ల ఆదా
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర చరిత్రలోనే నాగార్జున‌సాగర్‌ (Nagarjuna Sagar)లో జెన్‌కో (GENCO) రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని సాధించింది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంలో సాగర్‌లోకి వరద నీరు పోటెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 1,400 మిలియన్ యూనిట్ల లక్ష్యానికి బదులుగా 1,657 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి సాధించి కేవలం రెండు నెలల్లోనే జెన్‌కో వార్షిక లక్ష్యాన్ని సాధించింది. ఈ అద్భుతంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.900 కోట్ల ఆర్థిక భారం తగ్గినట్లుగా జెన్‌కో సీఈ మంగేష్ కుమార్ (CE Mangesh Kumar) ధృవీకరించారు. అయితే, ఎగువ నుంచి ఇలాగే వరదలు కొనసాగితే 3 వేల మిలియన్ యూనిట్ల లక్ష్యం సాధిస్తామని పేర్కొన్నారు. KRMB ఆదేశాలతో సాగర్ వద్ద విద్యుత్ ఉత్పత్తి తాత్కాలికంగా నిలిపివేశామని, అంతర్రాష్ట్ర జల వివాదాల ప్రభావంతో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ పడినా.. తిరిగి తాము విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించామని జెన్‌కో ఉన్నతాధికారులు వెల్లడించారు.

Next Story