17 నుంచి TG ECET సర్టిఫికెట్ వెరిఫికేషన్

by Kema Shiva Kumar |

టీజీఈసెట్ 2025 మొదటి దశ కౌన్సెలింగ్ కు సంబంధించి ఈ నెల 17 నుంచి 19 వరకు స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీజీఈసెట్ కన్వినర్ ఒక ప్రకటనలో తెలిపారు.

17 నుంచి TG ECET సర్టిఫికెట్ వెరిఫికేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీఈసెట్ 2025 మొదటి దశ కౌన్సెలింగ్ కు సంబంధించి ఈ నెల 17 నుంచి 19 వరకు స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీజీఈసెట్ కన్వినర్ ఒక ప్రకటనలో తెలిపారు. 14న ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్ కు అవకాశం కల్పించారు. ఈ నెల 17 నుంచి 21 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించారు. ఈ నెల 25 లోపు సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. తొందరగా స్లాట్ బుక్ చేసుకుని, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరైన అభ్యర్థులకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుంది. కాబట్టి, అభ్యర్థులు, తల్లిదండ్రులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, వెంటనే స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు https://tgecet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. టీజీఈసెట్-2025 ద్వారా మొత్తం 13,013 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Next Story