- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టీజీ ఈసీఈటీ, టీజీలాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ విడుదల

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీ ఈసీఈటీ సెట్, టీజీలాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ విడుదల చేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ మొలుగారంతో శనివారం సమావేశమై సెట్ కమిటీ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఇ. పురుషోత్తం, ప్రొఫెసర్ ఎస్.కె.మహ్మద్, టీజీసీహెచ్ఈ సెక్రటరీ శ్రీరాం వెంకటేష్, టీజీఈసీఈటీ సెట్ కన్వీనర్ పి.చంద్రశేఖర్, లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బి.విజయలక్ష్మి, సెట్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. పీజీఎల్‌సీ సెట్-2025 సిలబస్‌లో స్వల్ప మార్పులు చేసినట్టు ఉన్నతవిద్యామండలి తెలిపింది. కాగా ఈ రెండు సెట్ ఎగ్జామ్స్‌ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.
టీజీ ఈసీఈటీ షెడ్యూల్ తేదీలు ఇవే
ఫిబ్రవరి 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆన్ లైన్‌లో దరఖాస్తుల సమర్పించేందుకు మార్చి 3 చివరి తేది కాగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఆలస్య రుసుముతో రూ.500లతో సాధారణ అభ్యర్థులకు రూ.900లతో ఏప్రిల్ 4 చివరి తేదీగా ప్రకటించారు. ఎగ్జామ్స్‌ను మే 12న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు బీఈ, బిటెక్, బీఫార్మాలో ప్రవేశాల కోసం ఈ ఎగ్జామ్స్‌ను నిర్వహించనున్నారు.
తెలంగాణ లాసెట్, పీజీ ఎల్ సెట్ షెడ్యూల్
లా కోర్సులో ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యామండలి లాసెట్, పీజీ ఎల్‌సెట్ నోటిఫికేషన్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఫిబ్రవరి 25న నోటిఫికేషన్ విడుదల చేసి మార్చి 1 నుంచి మే 25వ తేదీ వరకు లేట్ ఫీజుతో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. అదేవిధంగా జూన్ 6న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. మూడేళ్లు, ఐదేళ్లు ఎల్ఎల్బీ కోర్సులు, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సు లకు అర్హతలను పరిశీలించినట్టయితే.. మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఐదేళ్ల ఇంటిగ్రేటేడ్ LLB కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి. ఎల్ఎల్ఎం చేయాలనుకునే వారు డిగ్రీతో పాటు ఎల్ఎల్బీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మూడేళ్ల లా కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు, 5 ఏళ్ల ఎల్ఎల్ఎం కోర్సులకు సంబంధించి సాయంత్రం 4 గంటల నుంచి 5.30 వరకు ఎగ్జామ్స్ ను నిర్వహించనున్నారు ఉన్నారు. మరిన్ని వివరాల కోసం lawcetadm.tsche.ac.in ను సంప్రదించాలన్నారు.