TG: రేపు ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల

by Prasad Jukanti |   (  Updated:2026-05-16 10:10:12  IST  )

తెలంగాణ ఈఏపీసెట్ (TG EAPCET-2026) ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది.

TG: రేపు ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీ ఈఏపీసెట్ (TG EAPCET-2026) ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. జేఎన్‌టీయూ హైదరాబాద్ (JNTUH) లోని గోల్డెన్ జూబ్లీ హాల్‌లో జరిగే కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఫలితాలను రిలీజ్ చేయనున్నట్లు ఈఏపీ సెట్‌ కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ విజయకుమార్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితాల ప్రకటన పూర్తయిన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి మార్కులు, ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://eapcet.tgche.ac.in/ ను సందర్శించాలని కన్వీనర్ పేర్కొన్నారు. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ; మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్‌ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

Next Story