- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఈఏపీసెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ర్యాంక్ కార్డ్‌లను అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఈఏపీసెట్(TG EAPCET 2026) (ఇంజినీరింగ్, అగ్రికల్చర్-ఫార్మసీ) ఫలితాలు విడుదలయ్యాయి. జేన్ఎన్‍టీయూ-హెచ్‍లో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.బాలకృష్ణారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తదితరులు ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ http://eapcet.tgche.ac.in/ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఫలితాల్లో ఉప్పల్ కు చెందిన రుషిక్ ఫస్ట్ ర్యాంక్, అన్షుల్ (మూసాపేట్) రెండో ర్యాంక్, ఎం. వంశీధర్ రెడ్డి(పులివెందుల) మూడో ర్యాంక్ సాధించారు. వర్సిటీలో ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు ఫలితాలను విడుదల చేశారు. ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ చేపట్టనున్నారు.
పరీక్షలు పూర్తయిన ఆరో రోజే ఫలితాలు:
కాగా, జేఎన్టీయూ నిర్వహించిన ఈ పరీక్షల్లో భాగంగా మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు జరగగా, మే 9 నుండి 11 వరకు ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది 1,97,241 మంది విద్యార్థులు ఇంజనీరింగ్, 84,954 మంది అగ్రికల్చర్ పరీక్షలు రాశారు. పరీక్షలు పూర్తయిన ఆరో రోజే ఫలితాలను విడుదల చేస్తుండటం గమనార్హం. ఈసారి పరీక్ష ముగియగానే ప్రాథమిక కీ ఆధారంగా కంప్యూటర్ స్క్రీన్ పై మార్కులు ప్రత్యక్షమయ్యేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు.






