TG EAPCET: ప్రశాంతంగా ముగిసిన టీజీ ఎప్‌సెట్ అగ్రి, ఫార్మసీ పరీక్షలు.. 93.38% హాజరు నమోదు

by Ramesh Naini |

రాష్ట్రంలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎప్‌సెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.

TG EAPCET: ప్రశాంతంగా ముగిసిన టీజీ ఎప్‌సెట్ అగ్రి, ఫార్మసీ పరీక్షలు.. 93.38% హాజరు నమోదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన (TG EAPCET) టీజీ ఎప్‌సెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 2026-27 విద్యా సంవత్సరానికి గాను అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ అభ్యర్థులకు ఈ నెల 4, 5 తేదీల్లో మొత్తం మూడు సెషన్లలో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 93.38 శాతం హాజరు నమోదైనట్లు టీజీ ఎప్‌సెట్ కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

మంగళవారం పరీక్షల సరళిని టీజీసీహెచ్ఈ చైర్మన్, ఇతర జేఎన్టీయూ అధికారులు పర్యవేక్షించారు. మొదటి రోజు ఉదయం సెషన్‌కు 92.46 శాతం, రెండో సెషన్‌కు 93.35 శాతం మంది హాజరుకాగా, రెండో రోజు ఉదయం పరీక్షకు 94.33 శాతం మంది హాజరయ్యారు.

Next Story