- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరికాసేపట్లో TG EAPCET- 2026 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ ఈఏపీసెట్-2026 ఫలితాలు నేడు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. మీ ర్యాంక్ కార్డ్స్ కోసం అధికారిక వెబ్‌సైట్ చూడండి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష(టీజీ ఈఏపీసెట్)-2026 ఫలితాలు నేడు ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా విడుదల చేయనున్నారు. జేఎన్టీయూ నిర్వహించిన ఈ పరీక్షల్లో భాగంగా మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు జరగగా, మే 9 నుండి 11 వరకు ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది 1,97,241 మంది విద్యార్థులు ఇంజనీరింగ్, 84,954 మంది అగ్రికల్చర్ పరీక్షలు రాశారు. నేడు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‍లోని జేఎన్టీయూ గోల్డెన్ జూబ్లీ హాల్‍లో జరిగే కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల ప్రక్రియ పూర్తయిన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‍ను ఎంటర్ చేసి మార్కులు, ర్యాంకు కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ http://eapcet.tgche.ac.in/ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని కన్వీనర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీలో ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు ఫలితాలను విడుదల చేస్తున్నారు.






