TG DEECET 2026 ఫలితాలు విడుదల.. వెబ్ ఆప్షన్ల తేదీలపై కీలక అప్ డేట్

by Prasad Jukanti |   (  Updated:2026-05-30 05:37:43  IST  )

తెలంగాణ డీఈఈసెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. 84.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ర్యాంక్ కార్డ్స్, వెబ్ ఆప్షన్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

TG DEECET 2026 ఫలితాలు విడుదల.. వెబ్ ఆప్షన్ల తేదీలపై కీలక అప్ డేట్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ డీఈఈసెట్-2026 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను హాల్‌ టికెట్‌ నంబర్ ఎంటర్‌ చేసి అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ https://deecet.cdse.telangana.gov.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 6 జూన్ 2026 నుండి 8 జూన్ 2026 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చుని అధికారులు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష ఆధారంగా డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఈఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌(డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. D.El.Ed, D.P.S.E కోర్సుల్లో ప్రవేశాల కొరకు 27 ఫిబ్రవరి 2026న నోటిఫికేషన్ విడుదల కాగా ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ పరీక్షను 21 మే 2026 న నిర్వహించారు. మొత్తం 25,054 మంది పరీక్ష రాయగా 21,137 మంది అర్హత సాధించి 84.36 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం.

ర్యాంకర్ల వివరాలు:

ఈ పరీక్షకు హాజరైన వారిలో తెలుగు మీడియంలో బి. ఆనంద్ (హాల్ టికెట్ నం: 2601032403) 76 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించగా, ఇంగ్లీశ్ మీడియంలో జవ్వాజీ శివ నాగేశ్వర్ (హాల్ టికెట్ నం: 2603081513) 83 మార్కులు, ఉర్దూ మీడియంలో దానిష్ అహ్మద్ (హాల్ టికెట్ నం: 26020500925) 66 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించారు.

Next Story