- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG CPGET షెడ్యూల్ విడుదల.. మే 15 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (TG CPGET) 2026 నోటిఫికేషన్ విడుదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష' (TG CPGET-2026) షెడ్యూల్‌ను బుధవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.వి.బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్ ప్రొ.ఇ.పురుషోత్తం, ఆయా యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లు విడుదల చేశారు. గతేడాది ఓయూ సీపీగెట్ పరీక్ష నిర్వహించగా, ఈ ఏడాది ఆ బాధ్యతలను కాకతీయ యూనివర్శిటీకి అప్పగించారు. ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది పీజీలో కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఆగస్టు మొదటి వారంలో పీజీ క్లాసులు ప్రారంభిస్తామన్నారు. ఓయూ వీసీ మాట్లాడుతూ.. ఓయూలో రూ. 75 కోట్లతో రీసెర్చ్ ప్రాజెక్టులు, 650 పీహెచ్‌డీ అడ్మిషన్లు చేపట్టినట్లు తెలిపారు. ఓయూకు సంబంధించిన పరిశోధనలను క్యూ1, క్యూ2 జర్నల్స్‌లో పబ్లిష్ చేస్తున్నట్లు వెల్లడించారు. కేయూ వీసీ మాట్లాడుతూ.. కేయూలో ఫెలోషిప్స్ మీద వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు.
జూలై మొదటి వారంలో పరీక్షలను నిర్వహించనున్నట్లు సీపీగెట్ కన్వీనర్ ప్రొ.వి.రాజేందర్ కట్ల తెలిపారు. ఓసీ, బీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.800 కాగా, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ. 600 గా నిర్ణయించారు. అదనపు సబ్జెక్టు రాసే వారు ఒక్కో పేపర్‌కు రూ.450 చెల్లించాల్సి ఉంటుందన్నారు. పరీక్ష అనంతరం జూలై 17న ప్రాథమిక 'కీ' విడుదల చేస్తారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే జూలై 19 వరకు సమర్పించవచ్చు. ఒక్కో అభ్యంతరానికి రూ. 200 చెల్లించాలి. ప్రవేశ పరీక్ష ఫలితాల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు కన్వీనర్ తెలిపారు.
దరఖాస్తుల వివరాలు ఇలా..
నోటిఫికేషన్ విడుదల: మే 15
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: మే 15
చివరి తేదీ (ఆలస్య రుసుము లేకుండా): జూన్ 10
రూ.500 ఆలస్య రుసుముతో: జూన్ 14 వరకు
రూ.2,000 ఆలస్య రుసుముతో: జూన్ 18 వరకు
దరఖాస్తుల సవరణ: జూన్ 16 నుంచి 19 వరకు
హాల్ టికెట్ల డౌన్‌లోడ్: జూన్ 28






