టీజీ సీపీగెట్-2025 ఎంఈడీ, ఎంపీఈడీ సీట్ల కేటాయింపు.. అధికారుల కీలక సూచనలు

by Ramesh Naini |

టీజీ సీపీగెట్-2025లో భాగంగా ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం సీట్ల కేటాయింపును విడుదల చేసినట్లు అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి తెలిపారు.

టీజీ సీపీగెట్-2025 ఎంఈడీ, ఎంపీఈడీ సీట్ల కేటాయింపు.. అధికారుల కీలక సూచనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: (TG CPGET-2025) టీజీ సీపీగెట్-2025లో భాగంగా ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం సీట్ల కేటాయింపును బుధవారం విడుదల చేసినట్లు అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి తెలిపారు. మొదటి దశలో మొత్తం 655 మందికి సీట్లు కేటాయించగా, 1,258 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను వినియోగించినట్లు వెల్లడించారు.

ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ కళాశాలలు, అనుబంధ కళాశాలలో సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. సీటు పొందిన విద్యార్థులు నిర్దేశించిన ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించి, ఈ నెల 19వ తేదీలోపు సంబంధిత కళాశాలల్లో ఒరిజినల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC) సమర్పించి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అని కన్వీనర్ తెలిపారు.

Next Story