టీజీ సీపీగెట్ 2025 ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ విడుదల.. ఈనెల 28న సీట్ల కేటాయింపు

by Ramesh Naini |

రాష్ట్రంలోని ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఫైనల్ ఫేజ్ షెడ్యూల్‌ను టీజీ సీపీగెట్ 2025 కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగ రెడ్డి విడుదల చేశారు.

టీజీ సీపీగెట్ 2025 ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ విడుదల.. ఈనెల 28న సీట్ల కేటాయింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఫైనల్ ఫేజ్ షెడ్యూల్‌ను టీజీ సీపీగెట్ 2025 కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగ రెడ్డి విడుదల చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 24 వరకు పూర్తి చేసుకోవాలని తెలిపారు. వెరిఫికేషన్ వివరాలు అభ్యర్థులకు నవంబర్ 25 న అందుబాటులో ఉంటాయన్నారు. ఈనెల 26, 27 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించారు. వెబ్ ఆప్షన్లలో మార్పులకు ఈ నెల 27న ఒక విండో తెరవబడుతుందని తెలిపారు. ఈ నెల 28 న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. సీటు పొందిన అభ్యర్థులు నవంబర్ 30 వరకు తమకు కేటాయించిన కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు.

Next Story