TG: జపాన్‌లో సీఎం రేవంత్ బృందం బిజీ బిజీ.. నేడు కీలక ఒప్పందాలు!

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-21 04:12:04  IST  )

తెలంగాణ (Telangana)లో విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలు, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలోని తెలంగాణ రైజింగ్ బృందం జపాన్ పర్యటన సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది.

TG: జపాన్‌లో సీఎం రేవంత్ బృందం బిజీ బిజీ.. నేడు కీలక ఒప్పందాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలు, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలోని తెలంగాణ రైజింగ్ బృందం జపాన్ పర్యటన సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ పర్యటనలో భాగంగా తెలంగాణ సర్కార్ (Telangana Government) పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒసాకా (Osaka) వేదికగా ఆదివారం ప్రారంభమైన వరల్డ్ ఎక్స్‌పో (World Expo)లో ఇవాళ తెలంగాణ పెవిలియన్‌ (Telangana Pavilion)ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి వచ్చే పలు కంపెనీలతో సీఈవో (CEO)లు, ప్రతినిధులతో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం (Business Round Table Meeting)లో పాల్గొననున్నారు. అనంతరం ఆ భేటీ ముగిసిన వెంటనే ఒసాక రివర్ ఫ్రంట్‌ (Osaka Riverfront)ను సీఎం ఆధ్వర్యంలోని తెలంగాణ రైజింగ్ బృందం పరిశీలించనుంది.

కాగా, ఆదివారం కిటాక్యూషు (Kitakyushu_ నగరాన్ని సందర్శించిన సీఎం రేవంత్ బృందం హైదరాబాద్‌ (Hyderabad)లో ఎకో టౌన్‌ (Eco Town) ఏర్పాటుకు ఈఎక్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ (EX Research Institute), పీ9 ఎల్‌ఎల్‌సీ (P9 LLC), నిప్పాన్‌ స్టీల్‌ ఇంజినీరింగ్ (Nippon Steel Engineering), న్యూ కెమికల్‌ ట్రేడింగ్ (New Chemical Trading), అమితా హోల్డింగ్స్‌ (Amita Holdings) సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ మేరకు ఆ కంపెనీలు పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్‌ రంగాల్లో భాగస్వామ్యం పంచుకోనున్నాయి.

Next Story