టీజీ సీపీగెట్ 2025.. తుదివిడతలో 6943 మందికి సీట్ల కేటాయింపు

by Malleboina Mahesh |

రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఎల్ఐసీ తదిరత కోర్సుల్లో ప్రవేశాలు.

టీజీ సీపీగెట్ 2025.. తుదివిడతలో 6943 మందికి సీట్ల కేటాయింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఎల్ఐసీ తదిరత కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సీసీగెట్ 2025 తుది విడతలో 6,943 మంది సీట్లు పొందినట్లు సీపీగెట్ 2025 కన్వినర్ ప్రొ. ఐ. పాండురంగా రెడ్డి తెలిపారు. తుది విడతలో మొత్తం 13,542 మంది వెబ్ ఆప్షన్లు వినియోగించుకున్నారు. సీటు పొందిన విద్యార్థులు నిర్దేశించిన కోర్సు, కాలేజీ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత, అభ్యర్థులు తమ అసలు టీసీ ని ఈ నెల 11 లోపు సంబంధిత కాలేజీల్లో సమర్పించి, రిపోర్ట్ చేయాలన్నారు. పూర్తి వివరాలకు తప్పనిసరిగా వెబ్‌సైట్‌లను www.osmania.ac.in, https://cpget.tgche.ac.in/, www.ouadmissions.com సంప్రదించాలని సూచించారు.

Next Story