- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Budget: లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. కొత్తగా 2 లక్షల మందికి చేయూత పెన్షన్లు
పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2026-27 బడ్జెట్‌లో కొత్తగా 2 లక్షల మందికి చేయూత పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లుగా సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలు, వృద్ధులు, ఆసరా అవసరమైన వారికి భారీ ఊరటనిచ్చింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌లో భాగంగా కొత్తగా మరో 2 లక్షల మందికి ‘చేయూత’ పెన్షన్లు (Cheyutha pensions) మంజూరు చేయనన్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రామర్క ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన సుమారు 2 లక్షల మందికి ఈ ఏడాది నుంచి కొత్తగా పెన్షన్లు అందనున్నాయి. పెన్షన్ల పంపిణీకి ఆటంకం కలగకుండా బడ్జెట్‌లో భారీగా నిధులను కేటాయించారు. అయతే, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ సామాజిక భద్రతా పింఛన్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఈ నిర్ణయంతో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.






