- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు.. సభలో ప్రవేశ పెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ప్రవేశపెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, తమ ప్రభుత్వ లక్ష్యాలను మరియు ప్రాధాన్యతలను సభకు వివరించారు. ప్రజలే మాకు పరామావధి. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే ఈ గొప్ప అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని భట్టి విక్రమార్క తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని, దేశంలోనే తెలంగాణను నంబర్ వన్‌గా నిలపడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. బడ్జెట్ అంటే కేవలం అంకెల చుట్టూ తిరిగే సంఖ్యల గారడీ కాదని.. వాస్తవాలకు దగ్గరగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా దీనిని రూపొందించామని అన్నారు. గొప్పల కోసం మేము ఎప్పుడూ అబద్ధాలు చెప్పబోమన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమానికి, మహిళాభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఉంటుందని ఆయన వెల్లడించారు. మహిళా సాధికారత దిశగా కీలక కేటాయింపులు చేసినట్లు సూచించారు. రాష్ట్ర సంస్కృతిని కాపాడటంలో తమ ప్రభుత్వం ముందుంటుందని, గద్దర్ అవార్డుల ద్వారా కళాకారులను గౌరవించామని తెలిపారు. అలాగే మేడారం జాతరను అత్యంత వైభవోపేతంగా నిర్వహించామని గుర్తు చేశారు.
తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.3,24,234 కోట్లుని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అందులో రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లని, మూలధన వ్యయం రూ.47,267 కోట్లని తెలిపారు. ఇక రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లుగా ఉందని, వృద్ధి రేటు 10.20 శాతంగా ఉందన్నారు. జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు 2.7శాతం ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం 1.9 రెట్లు పెరిగిందని తెలపారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్నామని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్ అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
శాఖల వారీగా కేటాయింపులు ఇలా..
పశు సంవర్థక శాఖకు రూ.1,529 కోట్లు
విద్యుత్ శాఖకు రూ.21,285 కోట్లు
విద్యా శాఖకు రూ.26,674 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖకు రూ.13,679 కోట్లు
కార్మిక శాఖకు రూ.998 కోట్లు
మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.3,143 కోట్లు
ఎస్సీ సంక్షేమానికి రూ.11,784 కోట్లు
ఎస్టీ సంక్షేమానికి రూ.7,937 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ.3,769 కోట్లు
రాజీవ్ యువ వికాసానికి రూ.6 వేల కోట్లు
గృహ నిర్మాణ శాఖకు రూ.7,430 కోట్లు
ఐటీ శాఖకు రూ.875 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.3,490 కోట్లు
చేనేత రంగానికి రూ.258 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.33, 688 కోట్లు
నీటిపారుదల శాఖకు రూ.22, 615 కోట్లు
ఆర్ అండ్ బీ శాఖకు రూ.12,789 కోట్లు
న్యాయ శాఖకు రూ.2,367 కోట్లు
H -Citi పథకం కింద రూ.2,654 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.17,907 కోట్లు
హోం శాఖకు రూ.11,907 కోట్లు
గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం రూ.500 కోట్లు
పర్యాటక శాఖకు రూ.1,224 కోట్లు






