- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Budget: ఆరు గ్యారంటీలకు రూ.50,713 కోట్ల కేటాయింపు.. గతేడాది కంటే రూ.5,368 కోట్ల మేర తగ్గిన నిధులు
తెలంగాణ బడ్జెట్‌లో ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం రూ.50,713 కోట్ల నిధులు కేటాయించింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌లో, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ‘ఆరు గ్యారంటీల’ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. సంక్షేమమే ధ్యేయంగా రూపొందించిన ఈ బడ్జెట్‌లో కేవలం ఆరు గ్యారంటీల కోసమే మొత్తం రూ.50,713 కోట్లు కేటాయించడం గమనార్హం. అయితే, ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. గత ఏడాది ఆరు గ్యారంటీల అమలుకు బడ్జెట్‌లో రూ.56,084 కోట్లు కేటాయించగా, ఈసారి మాత్రం రూ.50,713 కోట్లు మాత్రమే నిధులు కేటాయించారు. దీంతో ఈ ఏడాది ఆరు గ్యారంటీల అమలుకు రూ.5,371 కోట్ల మేర నిధులు తగ్గాయి. ప్రస్తుతం ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
పథకాల వారీగా కేటాయింపులు ఇలా..
రైతు భరోసా: రూ.18,000 కోట్లు
చేయూత పెన్షన్లు: రూ.14,861 కోట్లు
విద్యుత్ రాయితీ (వ్యవసాయం): రూ.14,000 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లు: రూ.5,500 కోట్లు
ఉపకార వేతనాలు: రూ.4,343 కోట్లు
మహాలక్ష్మి పథకం (ఉచిత బస్సు ప్రయాణం): రూ.4,305 కోట్లు
కల్యాణలక్ష్మీ పథకం: రూ.3,683 కోట్లు
వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్: రూ.3,500 కోట్లు
గృహజ్యోతి (ఉచిత విద్యుత్): రూ.2,080 కోట్లు
రాజీవ్ ఆరోగ్యశ్రీ (వైద్య సేవలు): రూ.1,143 కోట్లు
మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ (రూ.500): రూ.723 కోట్లు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా: రూ.600 కోట్లు






