- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG BJP: బీజేపీ శ్రేణులకు తీపి కబురు.. జూలై 1న రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక
బీజేపీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నతెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది.

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ప్రెసిడెంట్ ఎలక్షన్‌కు ఆదివారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అదేవిధంగా సోమవారం పదవికి పోటీ పడుతోన్న అశావహుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లుగా బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వెల్లడించారు. జులై 1న ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర అధ్యక్షుడిని అదే రోజున అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు.
ఆ నలుగురి మధ్య తీవ్ర పోటీ..
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పార్టీ తీవ్ర పోటీ నెలకొంది. ఈ మేరకు పలువురు నేతలు ఢిల్లీ స్థాయిలో ఎప్పటి నుంచో లాబీయింగ్ మొదలు పెట్టారు. ఈ జాబితాలో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్‌రావు, ధర్మపురి అర్వింద్ ఉన్నట్లుగా బీజేపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి తిరిగి మళ్లీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పోటీలు ఉన్న నేతలంతా బయటకు తాము రేసులో లేమని చెబుతున్నా.. లోలోపల పదవీ కోసం తీవ్రంగా లాబీయింగ్‌లు చేస్తు్న్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తోందనని బీజేపీ శ్రేణుల్లో టెన్షన్ వాతావరణ నెలకొంది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం అధ్యక్షుడి ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకున్నట్లుగా సమాచారం.
అధికారంలోకి రావడమే పరమావధిగా.. యాక్షన్ ప్లాన్
లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లతో దుమ్ములేపిన కమలనాథులు.. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సత్తా చాటారు. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు స్ఫూర్తితో రాబోయే స్థానిక ఎన్నికల సమారానికి సమాయత్తమవుతున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే బూత్ లెవల్ నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల నియామకాలను కూడా పూర్తి చేశారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ అధినాయకత్వం పార్టీ తరఫున వరుసగా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తూ.. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా బీజేపీ అధిష్టానం పక్కాగా యాక్షన్ ప్లాన్‌ను రూపొందించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.






