TG Assembly: మాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు.. అసెంబ్లీలో హరీశ్ రావు

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-15 15:22:04  IST  )

మూడో రోజు అసెంబ్లీ (Assembly) సమాశాలు ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి.

TG Assembly: మాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు.. అసెంబ్లీలో హరీశ్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: మూడో రోజు అసెంబ్లీ (Assembly) సమాశాలు ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి. గవర్నర్ (Governor) ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే విపక్ష నేత హరీశ్ రావు (Harish Rao)ను‌ మాట్లాడేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ.. ముందుగా జగదీశ్ రెడ్డి (Jagadish Reddy)పై సస్పెన్షన్ వేటును ఎత్తి వేయాలని కోరారు. తన సభ్యుడు సభలో అమర్యాదగా గానీ, ఏకవచనంతో గానీ.. స్పీకర్‌ను సంబోధించలేదని అన్నారు. తమకు స్పీకర్ పట్ల అపారమైన గౌరవం ఉందని.. ఎలాంటి దురుద్దేశాలు లేవని తెలిపారు. సస్పెన్షన్‌కు ముందు జగదీశ్ రెడ్డికి మైక్ ఇస్తే చెప్పుకునే అవకాశం ఉండేదని అన్నారు. సభా సంప్రాదాయాలు పాటించాలని.. తమ నాయకుడు కేసీఆర్ (KCR) నిత్య చెబుతుంటారని గుర్తు చేశారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై పున: పరిశీలించాలని సభా ముఖంగా హరీశ్ రావు, స్పీకర్‌ ప్రసాద్ కుమార్‌ను కోరారు.

స్పీకర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినతి..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు (Harish Rao), సుధీర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాధవరం కృష్ణారావు, సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద ఇవాళ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ (Speaker Prasad Kumar)ను ఆయన ఛాంబర్‌కు వెళ్లి కలిశారు. అనంతరం తమ సభ్యుడు జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్‌ను ఎత్తి వేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు అక్రమం, అన్యాయమని సవివరంగా స్పీకర్‌కు తెలిపారు.

READ MORE ...

TG Assembly: స్పీకర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. అసలు విషయం ఇదే!


Next Story