- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Assembly: ఇచ్చిన మాట ప్రకారం ఆ పని చేశాం.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన మాట మేరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన మాట మేరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. ఇవాళ అసెంబ్లీ గవర్నర్ (Governor) ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. రుణ మాఫీ విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఏ జిల్లాలో ఎంత రుణమాఫీ చేశామో లెక్కలతో సహా ఇస్తామని ఛాలెంజ్ విసిరారు.
ఎవరెవరికి రుణమాఫీ అయిందో.. ఆయా గ్రామ పంచాయతీల వద్ద జాబితాను ప్రదర్శించామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన కేవలం 3 నెలల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపించామని తెలిపారు. తాము అమలు చేస్తున్న ప్రతి పథకానికి సంబంధించి లెక్కలతో సహా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ముఖ్యగా గజ్వేల్ (Gajwel), సిరిసిల్ల (Sirisilla), సిద్దిపేట్ (Siddipet)లకు బీఆర్ఎస్ (BRS) కంటే ఎక్కువ మేలు చేశామని తెలిపారు. గృహజ్యోతి (Gruha Jyothi) పథకం కింద రూ.కోట్లు చెల్లిస్తున్నామని అన్నారు. ఇక్క సిద్దిపేట (Siddipet)లోనే ఆ పథకం కింద రూ.20.37 కోట్లు, సిరిసిల్లకు రూ.25 కోట్లు చెల్లించామని స్టేట్‌మెంట్లను చూపారు.
Read More..
TG Assembly: గత సర్కార్ ప్రజాస్వామ్య విలువలు మరిచింది.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు






