TG Assembly: గత సర్కార్ ప్రజాస్వామ్య విలువలు మరిచింది.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-15 15:24:30  IST  )

అబద్ధాల ప్రాతిపదిక కాదు.. వాస్తవాల మీద తాము ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

TG Assembly: గత సర్కార్ ప్రజాస్వామ్య విలువలు మరిచింది.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అబద్ధాల ప్రాతిపదిక కాదు.. వాస్తవాల మీద తాము ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ గవర్నర్ (Governor) ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2022 బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను పాటించ లేదని అన్నారు. మహిళా గవర్నర్‌గా తమిళిసౌ సౌందరరాజన్‌ను బీఆర్ఎస్ సర్కార్ అవమానించి విషయం నిజం కాదా అని ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం గాంధీ భనన్ కార్యకర్త ప్రసంగంలా ఉందంటూ.. కొందరు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని కామెంట్ చేశారు. ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు తాము మేనిఫెస్టో ఇచ్చామని.. అందులో చెప్పినవే అమలు చేస్తూ వన్నామని అన్నారు. మంత్రివర్గం ఆమోదించిన నిర్ణయాలే గవర్నర్‌ ప్రసంగంలో ఉంటాయని.. తమ ప్రభుత్వం విధానాన్ని గవర్నర్ సభలో చెప్పారని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ఇలానే వ్యవహరిస్తే.. రాబోయే ఎన్నికల్లో గుండు సున్నానే

ఈ మాత్రం అవగాహన లేనివాళ్లు పదేళ్లు మంత్రులుగా చేసినం అని చెప్పుకోవడానికి అనర్హులని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు ఇలాగే వ్యవహరిస్తే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గుండు సున్నా రావడం పక్కా అని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ వాళ్లకు గవర్నర్ అన్నా.. మహిళలు అన్నా గౌరవం లేదని ఆరోపించారు. అలాంటి తప్పులు తాము చేయబోమని అన్నారు. అబద్ధాల ప్రతిపాదన కాదు.. వాస్తవాల మీద ప్రభుత్వం నడపాలని చూస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. కొందరు అజ్ఞానమే గొప్ప విజ్ఞానం అనుకుంటున్నారని కామెంట్ చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం విపక్షాలు సూచనలు చేస్తే తప్పక స్వీకరిస్తామని అన్నారు. రాష్ట్రంలో అప్పుల కారణంగానే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రూ.20 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేశామని అన్నారు. మార్చి 31 నాటికి రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామని పేర్కొన్నారు. భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీమ భరోసా పేరుతో ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు.

సన్న వడ్లకు రూ.500 బోనస్

సన్న వడ్లకు రూ.500 బోనస్ కూడా ఇచ్చామని అన్నారు. గతంతో కేసీఆర్ వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనని అన్నారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే రైతులను వరి పండించాలని కోరామన అన్నారు. పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనగోలు చేస్తామంటూ రైతన్నలకు భరోసా ఇచ్చామని పేర్కొన్నారు. గతంలో ఎక్కడ పంట పండినా కాళేశ్వరం వల్లే అని చెప్పుకున్నారని.. కానీ కాళేశ్వరంలో నీళ్లు లేకపోయినా.. రికార్డ్ స్థాయిలో ధాన్యం పడిందని అన్నారు. గత ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు తీరని అన్యాయం చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Read More..

TG Assembly: పల్లా రాజేశ్వర్ రెడ్డి వాస్తవాలు మాట్లాడు.. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఫైర్

Next Story